నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. వదలక కురుపతి వారణావతమున లక్కయిల్ గావించి, యక్కజముగ
నందఱఁ జొన్పి యందనలంబు దరికొల్పఁ బనిచినఁ బాండునందను లెఱింగి
విదురోపదిష్ట్భూవి వరంబునం దప క్రాంతులై బ్రదికి నిశ్చింతు లయిరి
ధర్మువు నుచితంబుఁ దప్పని వారల సదమలాచారుల నుదిత సత్య
ఉ. రతుల నఖిల లోకహితమహారంభుల
భూరిగుణుల నిర్జితారి వర్గు
లై వెలుంగు వారి దైవంబ రక్షించు
దురిత విధుల నెపుడుఁ బొరయకుండ
భావం: తన దురుద్దేశం విడవక, దుర్యోధనుడు వారణావతంలో లక్క ఇల్లోక్కటి నిర్మించి అందులో పాండవులు ప్రవేశించేటట్లు చేసి దానికి నిప్పంటించు మని ఆజ్ఞాపించాడు. అది గ్రహించి పాండవులు విదురుడెఱిగించిన భూరంధ్రం నుండి బయటపడి బ్రతికి చింతలేని వారైనారు. ధర్మాన్ని, యోగ్యతను తప్పని సజ్జనులను, ఋజుమార్గవర్తనులను, సత్య సంధులను, సకల జన హితకారులను, గుణసంపన్నులను, జయించబడిన శత్రువుల సమూహం కలవారై ప్రకాశించేవారని, పాపకార్యాల నుండి దైవమే ఎప్పుడూ రక్షిస్తుంటాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము