భక్తి కథలు

హరివంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాలు ఊడిపోయినాయి. బండి భాగాలన్నీ విరిగి అటు ఇటూ చెల్లాచెదరై పడిపోయినాయి.
ఇంతలో యశోద త్వరత్వరగా ఇంటికి బయల్దేరింది. తక్కిన గోపికలకు తాను తొందరగా ఇంటికి వెళ్లి బిడ్డడికి పాలివ్వాలని చెప్పింది. ఆ మాట ఆమెకు గుర్తుతరాగానే ఆమెకు పాలు చేపాయి. దూడకోసం పరిగెత్తి వచ్చే ఆవులాగా ఆమె వేగంగా ఇంటికి వచ్చింది. అక్కడి దృశ్యం చూసేప్పటికి ఆమె గుండె పగిలిపోయింది. బండి శకల శకలాలై పసివాడి చుట్టూ పడి వుంది. పెద్దగా కేక పెట్టి ఒక్క అంగలో వచ్చి బిడ్డణ్ణి ఎత్తుకుని గుండెలకు గట్టిగా అదుముకుంది యశోద. ‘నిద్రపోతున్నావు కదా అని నిబ్బరంగా నాకింత చావు మూడిందని తెలియకుండా ఏటికి వెళ్ళాను కదారా కన్నా!
ఆ ఏటిలో పడక ఎందుకొచ్చానురా నాన్నా! ఇపుడు మీ తండ్రి వచ్చి నామీద ఎంత కోపం తెచ్చుకుంటాడో కదరా తండ్రీ! ఆయనకూ నేనేం చెప్పగలనురా బిడ్డా! ఈ బండి ఇట్లా ముక్కలు చెక్కలు కావటానికి కారణం ఏమిటి? నాకెవరు చెపుతారు? ఆయన రాగానే ఇదంతా ఇట్లా ఎట్లా జరిగింది? అని అడిగితే, ఆగ్రహిస్తే నేనెట్లా ఆయనకు సమాధానం చెప్పాలి? ఆయనే కాదు అందరూ నన్ను నిందిస్తారు. అని గజ గజలాడుతూ కొంచెం స్థిమితం తెచ్చుకుని పట్టికి పాలివ్వసాగింది యశోద. అపుడు నందుడు మందల నుండి ఇంటికి వచ్చాడు. అక్కడక్కడ కాస్త నెరసిన కేశపాశం, అడవిలో గోవుల అజమాయిషీకి నిత్యం పెడుతూ ఉండటంవల్ల అడవి తరువుల పూల పుప్పొడి తలమీద అక్కడక్కడ రాలి, దానితో గోవు గిట్టల ధూళి కూడా కలవడంతో, ఆయన జుట్టు ధూసర వర్ణం సంతరించుకొంది. చేతిలో చెర్నాకోల వుంది. తన చుట్టూ కొందరు గోపకుల ముచ్చలాడుతున్నారు. వాళ్ళతో కలిసి తన ఇంటికి వచ్చిన నందుడు అక్కడ చూసిన దృశ్యం చూసీ చూడగానే అవాక్కైనాడు. ఆయన వెన్నులో వొణుకు పుట్టింది. ఈ బండికిందనే యశోద బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడం రోజూ తాను చూస్తున్నదే! ఈ బండి ముక్కలు ముక్కలై, చెక్కలు చెక్కలై ఏ కీలుకాకీలు ఊడిపోయి చుట్టూ ఆ శకలాలు పడి ఉండడంతో ఆయన నివ్వెరపోయినాడు. మదించిన ఆబోతులు ఒకదానితో ఒకటి కుమ్ముకుంటూ వచ్చి ఈ బండిని కూలదోసాయా? ఏదైనా పెద్ద చెట్టు పెనుగాలికి వచ్చి దీని మీద విరిగి పడిందా?
అటువంటి విపరీతాలేమీ ఇక్కడ కనపడటం లేదు కదా! ఈ బండి ఎంత దృఢమైందీ? అనుకుంటూ యశోద దగ్గరకు వచ్చాడు నందుడు. తల్లి ఒళ్ళో బజ్జొని పాలు తాగుతున్న కృష్ణుణ్ణి చూశాడు. నోటినిండా పాలుండటంవల్ల చెక్కిళ్ళు నవ్వుతున్నవి. కలువల్లా కళ్ళు విప్పార్చి చంద్రబింబం లాంటి తల్లి మొగంపై చూపులు నిలిపాడు. ఎంతో ఆనందం, తృప్తీ, హారుూ వ్యక్తం చేస్తున్నది ఆ శిశువు వైఖరి. ఎనె్నన్ని జన్మాల పుణ్యమో తన ఇంటికి వచ్చింది ఈ కల్పవృక్షం అనుకున్నాడు నందుడు. కృష్ణుణ్ణి అట్లా చూసిన తరువాత నందుడి గుండె కుదుటపడింది. తన గుండె నిమురుకుని హాయిగా నిట్టూర్చాడు. ఈ ఉత్పాతం ఎందుకు వచ్చిందో, ఎట్లా కలిగిందో అదంతా నాకెందుకు? నా కన్నయ్య చల్లగా ఉన్నాడు, అదే నాకు చాలు, అన్నాడు. అపుడు యశోద గద్గద కంఠంతో మాట పెగల్చుకొని ‘నా తప్పు సైరించాలి మీరు. నా అపరాధం చాలా ఉంది. రోజుటిలాగానే మంచంపై మెత్తటి పక్క పరచి కృష్ణుడు నిద్రపోతున్నడు కదా అని మడుగు దగ్గరే కదా స్నానం చేసి ఇపుడే వచ్చేస్తాను అని గోపకాంతలతో కలిసి వెళ్ళాను. నేను వాళ్ళకోసం ఆగకుండా వెంటనే వచ్చేశాను. వచ్చి చూతును గదా! ఇంత ప్రమాదం జరిగిపోయింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు 28