నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ద్వారవతి కేఁగి యర్జునుఁ
దారంగ సుభద్రఁ బెండిజల యైవచ్చి, మహా
వీరు నభిమన్యుఁ గులవి
స్తారకు సత్పుత్త్రు నతిముదంబున ఁ బడిసిన్

భావం:అర్జునుడు ద్వారకానగరానికి వెళ్లి, అక్కడ సుభద్ర ను మనసార పెళ్లాడి వచ్చి, వీరుడు వంశవర్థనుడు అయిన అభిమన్యుడనే పేరుగల సత్పుత్త్రుడిని పొందాడు.
చ. పరమగురూప దేశమునఁ బార్థుఁడు పార్థివ వంశశేఖరుం
డరిది తపంబునన్ భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా
భరణుఁ బ్రసన్ను ఁ జేసి , దయఁబాశుపతాదిక దివ్యబాణముల్
హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్
భావం: అత్యుత్తముడైన గురువు యొక్క ఉపదేశం చేత రాజవంశ శ్రేష్ఠులైన అర్జునుడు, దుష్కర మైన తపం చేత నున్నూ బాహు పరాక్రమం చేతనున్నూ, శివుడిని దయతో ప్రసన్నుడిగా చేసికొని, శంకరుడి చేతను, ఇంద్రుడి చేతను , దేవతల సమూహం చేతను పాశుపతి మొదలైన దివ్య బాణాలను పొందాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము