నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. అయ్యహేంద్ర విషమహానల దగ్ధమై
విపుల పత్త్రదీర్ఘ విట పతతుల
గగన మండలంబుఁ గప్పిన యవ్వట
తరువు భస్మ మయ్యెఁ దత్‌క్షణంబ
భావం: పరీక్షిత్తును బ్రతికించాలనే ఉద్దేశంతో తనకు బ్రహ్మ ఇచ్చిన వరం చేత శక్తిగలవాడైన కశ్యపుడను ముని ఆనందోత్సాహంతో వెళ్తున్నాడు. అటువంటి వాని శక్తిసామర్థ్యాన్ని కనుగొనాలని అనుకొన్న తక్షకుడు వెంటనే ముసలి బ్రాహ్మణుని రూపంలో అడ్డుతగిలి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావంటూ అడిగాడు. ఆ తరువాత తన విషం వజ్రాయుధం కన్నా గొప్పదని చెబుతూ నీకు నిజంగా శక్తి సామర్థ్యముంటే ఎదురుగా కనిపిస్తున్న ఈ పచ్చని చెట్టును నేను కాటువేసి బూడిదను చేస్తాను. దాన్ని నీవు తిరిగి బతికించగలవా చెప్పుము అంటూ అడిగాడు. వెంటనే పాముల రాజయిన ఆ తక్షకుడు ఆ చెట్టుపై తనవిషాన్ని కుమ్మరించాడు. అపుడు ఆ తక్షకుని విషం వలన పుట్టిన గొప్ప అగ్ని చేత కాల్చబడి విశాలయైన ఆకుల చేత పొడవైన కొమ్మల సమూహాల చేత ఆకాశప్రదేశాన్ని ఆక్రమించిన ఆ మఱ్ఱిచెట్టు కాస్తా బూడిదగా మారిపోయింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము