రివ్యూ

టెన్షన్ పెట్టని టెర్రర్ (టెర్రర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
శ్రీకాంత్, నిఖిత, కోట శ్రీనివాసరావు, పృథ్విరాజ్, రవివర్మ తదితరులు.
సంగీతం:
సాయికార్తీక్
నిర్మాత:
షేక్ మస్తాన్
దర్శకత్వం:
సతీష్ కాసెట్టి

ఈమధ్య సోలో హీరోగా శ్రీకాంత్ కెరీర్ బాగా వెనకపడింది. మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కూడా సోలో హీరోగా హిట్ కొట్టాలనే కసితో సినిమాలు చేస్తున్నాడు శ్రీకాంత్. ప్రేమికుడిగా, భర్త పాత్రల్లో ఆకట్టుకున్న శ్రీకాంత్ పోలీస్ పాత్రలో కూడా బాగా నటిస్తాడన్న పేరుంది. ఆమధ్య ఖడ్గం తరువాత శ్రీకాంత్ చేసిన మరో పవర్‌ఫుల్ పోలీస్ సినిమా టెర్రర్. 2006లో వచ్చిన ‘హోప్’ అనే సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సతీష్ కాసెట్టి తీసిన సినిమా ‘టెర్రర్’. అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్‌మస్తాన్ నిర్మించిన క్రైమ్‌థ్రిల్లర్ ‘టెర్రర్’. చాలాకాలం నుండి హిట్‌కోసం తపిస్తున్న హీరో శ్రీకాంత్‌కు ఈ సినిమా విజయాన్ని అందించిందా లేదా? అనేది చూద్దాం!
కథలోకి వెళితే.. నిజాయితీకి నిలువెత్తు అవతారంగా పేరుతెచ్చుకున్న పోలీస్ అధికారి విజయ్ (శ్రీకాంత్), కొన్ని కారణాలవల్ల డ్యూటీ నుంచి సస్పెండ్‌అవుతాడు. ఇదే కారణంవల్ల తండ్రికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చిన విజయ్ భార్యతో జీవనం సాగిస్తూంటాడు. ఇదిలాఉంటే విజయ్‌కి ఒక కేసు ఇనె్వస్టిగేషన్‌లో దొరికిన చిన్న క్లూద్వారా హైదరాబాద్‌లో ఏదో పెద్ద అలజడి జరగబోతుందన్న విషయం అర్థమవుతుంది. ఆ కేస్‌ని సాల్వ్‌చేసే ప్రయత్నంలో విజయ్‌కి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కొంతమంది తీవ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు, అందులో కొందరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుసుకొని షాక్ అవుతాడు. ఆ కుట్రను ఎలా భగ్నం చేసాడు. చివరికి విజయ్ ఆ కుట్ర పన్నిన వారిని ఎలా పట్టుకుంటాడు? అన్నది మిగతా కథ.
హీరో శ్రీకాంత్ చాలారోజుల తరువాత తనలోని నటుడిని మరో మంచి పాత్ర ద్వారా బయటపెట్టాడు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికించి మెప్పించాడు. ఈ సినిమాలోని నటన శ్రీకాంత్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. శ్రీకాంత్ భార్యగా నిఖిత నటన ఫరవాలేదు. అక్కడక్కడ గ్లామర్ లుక్‌లో కూడా బాగానే మెప్పించింది. ఇక హోం మినిస్టర్‌గా నటించిన కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అనుచరుడిగా రవివర్మ మంచి నటన ప్రదర్శించాడు. ఇక పృథ్వీరాజ్ కామెడీ విలన్‌గా తనదైన టైమింగ్‌తో కట్టిపడేస్తాడు. నాజర్, విజయ్‌చందర్ కూడా తమ స్థాయి నటనను ప్రదర్శించారు. ఈ సినిమా విషయంలో ముఖ్యంగా కథ ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా స్క్రీన్‌ప్లేని రూపొందించుకున్నాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు వినా తరువాత నుంచి చివరివరకూ ఎక్కడా టెంపో తగ్గకుండా చూడటం సినిమాకు హైలెట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముస్లిం అయిన టెర్రరిస్ట్‌ని ఒక ముస్లిం పోలీస్ ఇంటరాగేట్ చేసే సీన్‌లో వచ్చే మాటలు బావున్నాయి. ఈ సినిమాకు అదే సిగ్నేచర్ సీన్‌గా చెప్పుకోవాలి. ఒక మంచి కథను స్పష్టంగా, సూటిగా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కలపకుండా సినిమా చేయడం దర్శకుడి నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాలి.
కథపరంగా అంత కొత్త కానె్సప్ట్ కాకపోయినా దర్శకుడిగా చాలాచోట్ల మంచి పనితనం చూపించాడు. ముఖ్యంగా శ్రీకాంత్‌నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాకు లక్ష్మీభూపాల్ రాసిన మాటలు బాగున్నాయి. శ్యామ్‌ప్రసాద్ దుప్పటి సినిమాటోగ్రఫీ ఓకే. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో ఎడిటింగ్ పరంగా ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ స్థాయలోనే ఉన్నాయ.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలతో తీసిన సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంది. టెర్రరిజాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమాలో కొత్త కథాంశం కాకపోయినా కథనం కట్టిపడేస్తుంది. దీనికి శ్రీకాంత్ నటన తోడయ్యింది. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో మొదటి పదిహేను నిముషాలు ఫరవాలేదనిపించినా, ఒకసారి కథ ట్రాక్‌లోకి వచ్చిన తరువాత ఆసక్తికరంగా సాగుతుంది. కథలో మేజర్ మైనస్ పాయింట్ -పదిహేను రోజుల్లో ఏదో జరగబోతుందని ‘టైంలాక్’ పెట్టడం. మొదట ఆసక్తి కలిగించినా తరువాత ఫస్ట్ పదమూడు రోజుల్లో జరిగే సన్నివేశాలు ఏమాత్రం థ్రిల్లింగ్‌గానీ, టెన్షన్‌నిగానీ కలిగించేలా రాసుకోకపోవడం. నాజర్, శ్రీకాంత్‌ల మధ్య ఉన్న తండ్రీ కొడుకుల అనుబంధం సరిగా చూపించలేదు. రెగ్యులర్ సినిమాలో ఉండే కమర్షియల్ పాయింట్స్ ఇందులో లేవు.

- త్రివేది