విజయవాడ

నాడు-నేడు పనులను నెలరోజుల్లో పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: వీఎంసీ పాఠశాలల అభివృద్ధికై చేపడుతున్న నాడు - నేడు అభివృద్ధి పనులను రానున్న నెలరోజుల్లో పూర్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని నాడు-నేడు అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ మురళీకృష్ణ, వీఎంసీ కమిషనర్ ప్రస న్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు శనివారం నగరంలోని ఐజీఎం స్టేడి యంలోని సమావేశ మందిరంలో ఇం జినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అడ్వైజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నాడు-నేడు మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ హెచ్‌ఎం, పేరెం ట్స్ కమిటీ ల ద్వారా పనులు చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం కింద నగర పాలక సంస్థ సర్కిల్ -1 పరిధిలో 18, సర్కిల్ -2 పరిధిలో 18, సర్కిల్-3 పరిధిలో 11 పాఠశాలలు మొత్తం 47 స్కూల్స్‌లో గుర్తించిన అంశాలు, పేరెంట్స్ కమిటీ సిఫార్సు చేసిన సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, పెయిటింగ్, ఫర్నీచర్, ప్రహరీ గోడ, పైప్‌లైన్ లీకేజీలు, ఫ్యాన్లు, లైట్లు తదితరాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఈ మరియన్న, ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

నేడు జనతా కర్ఫ్యూని పాటించండి
*సీపీఎం నేత మధు పిలుపు

విజయవాడ, మార్చి 21: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆయా దేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపడుతున్నాయని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం 7నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటించాలని చేసిన విజ్ఞప్తికి ప్రతిఒక్కరూ తమ సంఘీభావం తెలపాల్సిందిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.