విజయవాడ

జిల్లా విద్యాశాఖాధికారిగా దేవానందరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 19: జిల్లా విద్యాశాఖాధికారిగా డి దేవానందరెడ్డి నియమితులయ్యారు. కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా ఉ న్న దేవానందరెడ్డికి జిల్లా విద్యాశా ఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి సోమవా రం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారిగా వ్యవహరించిన ఎ సుబ్బారెడ్డిని టెట్ జాయింట్ డైరెక్టర్ గా కొనసాగాలని, ఆయన స్థానంలో గుంటూరు డివైఇవో పిల్లి రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చేందుకు రమేష్ సుముఖత చూపకపోవడంతో ఆ బాధ్యతలను ఆర్‌జెడిగా కొనసాగుతున్న దేవానందరెడ్డికి అప్పగించారు. దేవానందరెడ్డి 2012-15 కా లంలో జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్‌జెడిగా పదోన్నతి పొందిన మరుసటి రోజునే కొనే్నళ్లుగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఇవో పోస్టులను భర్తీ చేసి జిల్లాపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఇదిలావుండ గా గతంలో డిఇవోగా వ్యవహరించిన ఎ సుబ్బారెడ్డి భార్య చంద్రకళను నం దిగామ డివైఇవోగా నియమిస్తూ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈమెను జిల్లా పరిష త్ కార్యాలయ డివైఇవోగా బదిలీ చే యగా అందుకు ఆమె సుముఖత చూ పలేదు. దీంతో నందిగామ డివైఇవోగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం కలెక్టర్‌ని కలిసి డిఇవోగా దేవానందరెడ్డి బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.

దుర్గమ్మ సేవలో తెలంగాణ స్పీకర్

ఇంద్రకీలాద్రి, జూన్ 19: ఇంద్రకీలా ద్రిపై కొలువైన దుర్గమ్మను సోమవారం ఉదయం తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ పిఎ రామోహనరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయించారు. అనం తరం ఆశీర్వాద మండపంలో అర్చకులు ఆశీస్సులు, శేషవస్త్రాన్ని అందచేయగా, పిఎ ప్రసాదాలను అందచేశారు.