విజయవాడ

279 జీవో రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 22: పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 279ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎపి మున్సిపల్ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ జెఏసి పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన మున్సిపల్ కార్మికులతో నగర రహదారులు ఎరుపెక్కాయి. సిఎంఇవై, డ్వాక్రా సంఘాలకు చెందిన కార్మికులు ఏళ్ల తరబడి జీవనాధారంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను అమలుచేయకుండా తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలన్న డిమాండ్‌తో గత 18నెలలుగా మున్సిపల్ కార్మికులు తమ సంఘాల నేతృత్వంలో వివిధ రూపాల్లో పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టినా స్పందించని పాలకుల తీరును నిరసిస్తూ కార్మిక జెఏసి చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 110 మున్సిపాలిటీల నుంచి వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో రహదార్లు హోరెత్తాయి. నగర రైల్వే స్టేషన్ నుంచి పాత ప్రభుత్వ హాస్పటల్ మీదుగా అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్ వరకూ సాగిన ర్యాలీ అనంతరం జెఏసి నాయకులు ఉమామహేశ్వరరావు, ఆసుల రంగనాయకులు, గఫూర్, సిహెచ్ బాబూరావు, తదితరులు మాట్లాడుతూ అనేక రూపాల్లో చేపట్టిన కార్మిక ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్పందించకపోవడం గర్హినీయమన్నారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక దండునైనా చూసి 279 జీవోను రద్దు చేసి వేలాది మంది మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతపై భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే నెల 15లోగా ఈవిషయంపై సరైన స్పష్టతనిచ్చి రద్దు చేయకుంటే మరుసటిరోజు 16 నుంచి రాష్టవ్య్రాప్తంగా మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు. నేను మారానంటూ ఓట్లు వేయించుకొన్న సిఎం చంద్రబాబు చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు తీరు ఏమీ మార్చుకోలేదనడానికి మున్సిపల్ కార్మికులపై చూపుతున్న వివక్ష, కార్మిక వ్యతిరేక చర్యలే నిదర్శనమని వారు విమర్శించారు. గతంలో బుద్ధిచెప్పిన మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్పకతప్పదని హెచ్చరించారు.

కల్తీ నెయ్యి కంపెనీపై పోలీసుల దాడి
* వంద లీటర్ల నెయ్యి స్వాధీనం
పాయకాపురం, ఆగస్టు 22: కల్తీ నెయ్యి కేంద్రంపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి జరిపారు. అందిన సమాచారం మేరకు ఆ కంపెనీపై దాడి చేసి వంద లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో లక్ష్మీ నెయ్యి కంపెనీలో కల్తీ నెయ్యి తయారవుతున్నట్లు స్టేషన్ ఇన్‌చార్జి సిఐ సత్యనారాయణకు సమాచారం అందింది. దీంతో తన సిబ్బందితో సదరు కంపెనీపై ఆయన దాడి చేశారు. కంపెనీలో తయారైన వంద లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకుని కంపెనీ నిర్వాహకులు కొలుసు సుబ్రహ్మణ్యం, కొరికట్టు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నెయ్యి కంపెనీకి అనుమతులు లేవు. ల్యాబ్ నుండి రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. అక్రమ నెయ్యి అమ్మకాలపై ఇటీవల ‘్భమి’లో వార్త ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే.