విజయవాడ

అన్న కాదు.. అవినీతి అనకొండ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న వస్తున్నాడు అంటే అవినీతి అనకొండ వస్తున్నాడని జనం అనుకుంటున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆదివారం స్థానిక ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురవటంతో రాయలసీమ జలసీమగా మారడంతో రాష్ట్ర ప్రజలు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఆస్వాదిస్తున్నారన్నారు. కాని ప్రతిపక్ష నేత జగన్ మాత్రం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో కూర్చుని ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారన్నారు. రాయలసీమ అతలాకుతలం అయిందని, రోడ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాలు రాయటం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ఈ మధ్యనే లండన్ యాత్ర భేటీ కార్యక్రమాలు పూర్తయ్యాయని, చిత్తశుద్ధిలేని జగన్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఒక విదేశీ యాత్ర, ఒక భేటీ, ఒక ఉత్తరం రాస్తూ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని అందులో రాస్తారన్నారని, కనీసం ఆ లెటర్ మీద సంతకం పెట్టేటప్పుడు అయినా ఆ లెటరులో ఏముందో చూడకుండా సంతకం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మరలా పాదయాత్ర పేరుతో దోచుకోవడానికి ప్రజల దగ్గరకు వస్తున్నాడని జనం అనుకుంటున్నారని దోచుకోవడానికి మా దగ్గర ఏముందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారని ముందు దోచుకున్న డబ్బుకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని ఉత్తరాలు రాస్తున్నారన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమంతో వరుణదేవుడు కరుణించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిపించారన్నారు. కనీసం జగన్‌మోహన్‌రెడ్డి సంతకం పెట్టేటప్పుడు చూడకుండా రైతు రుణ విమోచనపై ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో రుణ విమోచన సాధ్యం కాదని మాట్లాడిన జగన్ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. పాదయాత్రకు డేటు పెట్టుకుని జలాశయాల్లో నీళ్లు రాకూడదని హైదరాబాద్‌లో కూర్చుని యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజల ఆశీస్సుల ముందు మీ ఆలోచనలు తిరగబడ్డాయని తెలిపారు. జగన్ హైదరాబాద్‌లో ఉండి పక్క రాష్ట్రంలో పేపర్లు చదువుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలియక పగటి కలలు కంటున్నారన్నారు. పట్టిసీమ దండగన్న ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో చెప్పారని, పట్టిసీమ ద్వారా 80 టిఎంసిలు తీసుకొచ్చి డెల్టా రైతులను కాపాడామని, దీనికి 24 గంటల్లో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్‌లో ఉన్నారో, బెంగుళూరు ప్యాలెస్‌లో ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత మే కంటే ఇప్పటికి రాష్ట్రంలో 5.46 మీటర్లు ఎక్కువగా వర్షాలు పడ్డాయన్నారు. పంట కుంటలు తవ్వుతుంటే వాటిని విమర్శించారని అధిక వర్షాలు పడటం వల్ల పంటకుంటలో నీరు నిల్వ ఉండి భూగర్భ జలాల మట్టాలు పెరుగుతున్నాయన్నారు. వాగులు, వంకల్లో పడిన వర్షాలు ఎక్కడికక్కడ నిర్మించిన చెక్ డ్యాంలు, నీటి కుంటల నీరు భూగర్భ జలంగా మారుతుందన్నారు. ఇవన్నీ జరుగుతుంటే పట్టించుకోని ప్రతిపక్ష నేత ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు.

45 రోజులకు వెలుగుచూసిన
మైనరు బాలిక మృతి కేసు
పాతబస్తీ, అక్టోబర్ 15: వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బాలిక (15) కేసు విషాదంగా ముగిసింది. ఆగస్టు 29న అదృశ్యమైన బాలిక ఆగస్టు 31న విజయవాడ ఏలూరు లాకుల వద్ద నీటిలో బయటపడింది. కానీ ఆ బాలిక వయస్సును 30 సంవత్సరాలుగా పోలీసులు రాయడం పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ఆమె వయస్సు 30గానే నిర్ధారించడంతో కేసు ఓ కొలిక్కి రావడానికి 45 రోజులు పట్టింది. ఆంధ్రభూమిలో సెప్టెంబర్ 15న ‘బాలిక దృశ్యమైనా పట్టించుకోని పోలీసులు కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారని బాలిక తల్లి ఆరోపణ’ అంటూ కథనం ప్రచురితమైన విషయం విదితమే. దాంతో పోలీసులు పరుగులు తీశారు. ఆ కేసు విచారణకు డిసిపి క్రాంతిరాణా టాటా మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా విశాఖ వెళ్లిన పోలీసులు రోడ్డు ప్రమాదానిక్కూడా గురయ్యారు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. దసరా ఉత్సవాల హడావిడి తగ్గాక సిఐ దాసరి కాశీవిశ్వనాధ్ మిస్సింగ్ కేసులు, అన్‌నోన్ డెడ్‌బాడీల వివరాలను నెట్లో చూస్తుండగా ఆగస్టు 31 గవర్నరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్‌నోన్ డెడ్ బాడీ ఫొటోలు డౌన్‌లోడు చేసుకుని మృతురాలు గుర్రం బుజ్జమ్మ (15) ఫొటోలు ఆమె తల్లికి చూపించగా తొలుత ఆమె గుర్తించలేదు. బాలిక అక్క కొండమ్మ మాత్రం తన చెల్లెలు చేయిపై గల పచ్చబొట్టును గుర్తించి ఆ మృతదేహం బుజ్జమ్మదేనని నిర్ధారించింది. దాంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకూ ఈ కేసు నిర్ధారణ విషయంలో ఓ కొలిక్కి రావడం జరిగింది. దాంతో బాలిక తల్లి దుర్గ స్టేషన్‌లో హృదయ విదారకంగా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆగస్టు 29న ప్రధాన నిందితుడు వేల్పుల వంశీ (22) బుజ్జమ్మను అనుమానించి చితకబాదాడు. అప్పటికే ఇద్దరూ ప్రేమికులే విఎంసిలో ఉద్యోగం వచ్చాక ఆమెను వివాహం చేసుకోవాలని వంశీ భావించాడు. బుజ్జమ్మ ఎవరితోనో మాట్లాడుతుందని అనుమానించిన వంశీ ఆమెను తీవ్రంగా కొట్టడమే గాకుండా ఆమె తల్లి దుర్గకి ఫోన్ చేసి నీవు మంచిదానివికావు నీ కూతురు కూడా అలానే తయారైందని బూతులు తిట్టాడు. ఇదంతా వంశీ మేనత్త కగ్గా దుర్గ ప్రోత్సాహంతోనే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఉద్యోగం రాక ముందు వంశీ బుజ్జమ్మల ప్రేమకు అభ్యంతరం చెప్పిన మేనత్తలు బుజ్జమ్మని పక్కకు నెడితే మంచి కట్నం, అందమైన అమ్మాయితో వివాహం జరిపిస్తానని వంశీ ఆలోచనను మార్చేందుకు యత్నించారు. వారి ప్రభావంతో వంశీకి అనుమానం బీజం నాటింది. దాంతో అతను ఆ బాలికను అవమానించాడు. ఆ అవమానం భరించలేని బాధితురాలు కృష్ణా కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తుండగా వంశీనే ఆమెను హతమార్చి కాలువలో పారేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీ, అతని మేనత్తలు ఇద్దరూ తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా పోలీసులు 30 సంవత్సరాల వయస్సుగా నమోదు చేసిన కేసు వయస్సు నిర్ధారణ కోసం డిఎన్‌ఏ పరీక్షలు చేయిస్తామని ఓ ప్రశ్నకి వన్‌టౌన్ సిఐ కాశీవిశ్వనాధ్ తెలిపారు. ఏదేమైనా ఈ కేసు విషాదంగా ముగియడం పాతబస్తీ వాసుల్లో విషాదం నెలకొంది. మల్లిఖార్జునపేట ప్రాంత వాసులు మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.