విజయవాడ

కట్టుబట్టలతో వచ్చాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 3: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో హైదరాబాదు నుండి ఆంధ్రా వాళ్లు రావాల్సి వచ్చిందనీ, ప్రస్తుతం అభివృద్ధే లక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను తలదనే్న విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందుంచాలని ముఖ్యమంత్రి ఎంతో శ్రమిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 55వ డివిజన్ నందమూరి నగర్‌లో రూ.3కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించిన 1000 కెఎల్ కెపాసిటీ మంచినీటి రిజర్వాయర్‌ను ఎంపి కేశినేని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎంపి కేశినేని, ఎమ్మెల్యే ఉమ మాట్లాడుతూ సింగపూర్ తరహాలో నూతన రాజధాని అమరావతి ఉండబోతుందని, ఇక్కడి నుండే అద్భుతమైన పాలనను చంద్రబాబు అందించనున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ల అవకాశవాద రాజకీయాల కారణంగానే రాష్ట్రం ముక్కలైందనీ, కనీసం ప్రత్యేక హోదాపై చట్టం కూడా చేయకుండానే విభజన చేయడం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌ను ఎదుర్కోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. గతంలో విద్యుత్ కోతలు అధికంగా ఉండేవనీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడం జరుగుతుందనీ, ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో పాలన సాగుతుందన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడ అద్భుతమైన నగరంగా ప్రకాశిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మాణ పనుల్ని వేగవంతంగా జరుపుతున్నామనీ, అలాగే నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామనీ, రానున్న కాలంలో మంచినీటి కొరత లేకుండా చేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, స్థానిక కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.