విజయవాడ

పశువైద్య విద్యార్థుల సమ్మె విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జూన్ 3: గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు గత 25 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను శుక్రవారం విరమించుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ నిమ్మరసం ఇచ్చి సమ్మెను విరమింప చేశారు. ప్రభుత్వ లోటు బడ్జెట్‌తో ఏర్పడిందన్నారు. పశుసంవర్థకశాఖకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. పశువైద్య విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు చొరవ చూపడం హర్షణీయం అన్నారు. సమ్మెకాలంలో నష్టపోయిన చదువు కోసం కష్టించి చదవాలన్నారు. విద్యార్థి సంఘ నాయకులు మహేష్‌రెడ్డి, అశోక్‌రెడ్డిలు మాట్లాడుతూ ముందుగా 500 గ్రామీణ పశువైద్య కేంద్రాలకు, అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వారు తెలిపారు. సమస్యల పరిష్కరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తరుణ్, సుభోష్ చంద్రబోస్, హేమ, భవ్య, దీప్తి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.