విజయవాడ

కేంద్రానికి కనువిప్పు కలిగేలా ధర్మపోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను ధర్మపోరాట దీక్ష ద్వారా కేంద్రానికి కనువిప్పు కలిగించేందుకు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఈ నెల 20వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం సాయంత్రం పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మపోరాట దీక్షకు జిల్లా నలుమూలల నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు భారీ స్థాయిలో తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షా కార్యక్రమానికి తరలివచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రిని ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని వేదిక ప్రాంగణం మొత్తం టెంట్‌లను ఏర్పాటు చేయాలని, నిరంతరం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని సూచించారు. దీక్షా వేదిక ప్రాంగణంలో అత్యవసర సేవలను అందించేందుకు వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి, వివిధ ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, ప్రజలు వీక్షించే విధంగా అవసరమైన ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా కళాశాలలు, యూనివర్శిటీలకు చెందిన 10వేల మంది విద్యార్థులు సంక్షేమ వసతి గృహల విద్యార్థులు, నగరపాలక సంస్థ, స్ర్తిశిశు సంక్షేమ శాఖలకు చెందిన సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొననున్నారన్నారు. ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, సుమారు 200 మంది ఆసీనులైయ్యేలా దీక్షా వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి తరలివచ్చే వారికి 200 ఆర్టీసీ బస్సులతో పాటు మరో ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీక్షకు తరలివచ్చే వారికి అల్పాహారం, భోజన ఏర్పాట్లను వారి ప్రయాణించే వాహనాలలోనే అందించడం జరుగుతుందన్నారు. దీక్షా వేదిక ప్రాంగణం మొత్తం చల్లగా ఉండేలా ఎయిర్ కూలర్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రాంగణంలో నిరంతరం మంచినీరు, మజ్జిగ ప్యాకేట్లను సరఫరా చేస్తున్నామని, ప్రాంగణంలోనికి ఎటువంటి తినుబండారాలు, పుష్పగుచ్చాలను అనుమతించడం లేదని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.

చుక్కల భూములు రిజిస్ట్రేషన్ చేయాలి
కోడూరు, ఏప్రిల్ 18: పేద, బలహీన వర్గాలను ఇబ్బంది పెడుతున్న చుక్కల భూములు వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ వైకాపా సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు కోరారు. ఆ భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తే ఇంట్లో ఆడపిల్ల పెండ్లి చేయాలన్న పేదవాడి బాధలు తీరుతాయన్నారు. ప్రస్తుతం భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరక్క సన్న, చిన్నకారు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా శ్రేణులు కోడూరు పురవీధులలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దార్ ఆశ్వర్ధనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.