విజయవాడ

సీ బిల్లులపై క్లారిటీ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 18: వీఎంసీలో వివిధ విభాగాల్లో అధికారులు ప్రతిపాదించే సీ బిల్లుల చెల్లింపులపై పూర్తి వివరణ ఉండాలని వీఎంసీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ఈమేరకు బుధవారం సాయంత్రం వీఎంసీ కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ సమావేశ హాల్లో మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన సభ్యులు యేదుపాటి రామయ్య, బుగతా ఉమామహేశ్వరి, దేవినేని అపర్ణ, తదితర సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో అధికారులు ప్రతిపాదించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. వివిధ సెక్షన్లు ప్రతిపాదించిన సీ బిల్లుల చెల్లింపులపై స్టాండింగ్ కమిటీ అడిగిన వివరణపై సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు తదుపరి సమావేశంలో వచ్చే ప్రతి సెక్షన్ సీ బిల్లులపై పూర్తి సమాచారాన్ని పొందుపర్చాలన్నారు. అంతేకాకుండా జనవరి 30 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరిగిన సీ బిల్లుల ఖర్చులను ఇప్పటివరకూ జరిగిన స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టకుండా అన్ని నెలలకు కలిపి ప్రస్తుతం జరిగిన సమావేశంలోకి ప్రతిపాదించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు జరిగే ప్రతి సమావేశానికి సీ బిల్లుల వివరాలను పొందుపర్చి ఆమోదం తెలపాలని సూచించారు. సీ బిల్లుల వ్యవహారంలో అధికారులు చేతివాటం చూపుతూ దుబరా వ్యయానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఈ విషయంపై పారదర్శకతగా వ్యవహరించాలన్నారు. వెహికల్ డిపోలో ఉన్న వీఎంసీ వాహనాలు, వాటి నిర్వహణా వ్యయం, సిబ్బంది వివరాలపై తదుపరి సమావేశాని కల్లా పూర్తి సమాచారం అందజేయాలని తీర్మానించారు.
కాంట్రాక్ట్ పద్ధతిన హెల్త్ అసిస్టెంట్లుగా 1992 నుంచి పనిచేస్తున్న డీ నాగేశ్వరరావు, ఎస్ రామ్మోహనరావుకు ప్రస్తుతం ఇస్తున్న నెల జీతం రూ.5,300 నుంచి రూ.15వేలకు, డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఎంవీ భాస్కర్‌కు రూ.7వేల నుంచి రూ.15వేలకు జీతం పెంచుతూ కమిటీ ఆమోదం తెలిపింది. వీఎంసీ సీఎంహెచ్‌ఓ పరిధిలో పనిచేస్తున్న వెహికల్ డ్రైవర్లు 14 మంది క్లీనర్లు ఏడుగురిని మరో సంవత్సరం పాటు కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ వారికి చెల్లించాల్సిన జీత భత్యాల కింద రూ.45 లక్షల 3వేల 200లను మంజూరు చేస్తూ తీర్మానించారు. అలాగే వెహికల్ డిపోలో మెకానిక్‌లుగా పనిచేస్తున్న 17 మంది, హెల్పర్లు 5గురిని 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి 31వరకూ కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగిస్తూ వారి జీత భత్యాల కింద చెల్లించాల్సిన 46లక్షల 32వేల రూ.100లను మంజూరు చేస్తూ కమిటీ తీర్మానించింది. ప్రొక్కలైన్ ఆపరేటర్లు, హెల్పర్ల కాంట్రాక్ట్‌ను 2018 నవంబర్ 31వరకూ పొడిగిస్తూ వారికి చెల్లించాల్సిన జీత భత్యాలు రూ.47లక్షల 24వేలను మంజూరు చేస్తూ తీర్మానించారు. వెహికల్ డీపోలో సీఎంఈవై కింద పనిచేస్తున్న హెల్పర్లు 10 మంది సిబ్బంది 2019 మార్చి 31 వరకూ పొడిగిస్తూ వారి జీతాల కింద చెల్లించాల్సిన రూ.15లక్షల 60వేల మంజూరుకు ఆమోదం తెలిపారు. వీటితోపాటు పలువురు వీఎంసీ ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రీఎంబర్స్‌మెంట్ నిధులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

స్వర్ణపతకం సాధించిన రాహుల్‌కు ఘనస్వాగతం
గన్నవరం, ఏప్రిల్ 18: ఆస్ట్రేలియాలో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన రాగాల వెంకట రాహుల్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో బుధవారం ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రాహుల్ ఇక్కడికి వచ్చేశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ ఛైర్మన్ డాక్టర్ అంకమ్మ చౌదరి, ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యుడు ఎన్.వరప్రసాద్ తదితరులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తున్నామన్నారు. రాహుల్ 55 కేజీల వెయిట్‌లిఫ్ట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నగదు, 3 ఎకరాల భూమి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం మరింత సహకారం అందిస్తుందని తెలిపారు. రాహుల్‌కు పలువురు అధికారులు, అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.