విజయవాడ

రాజధాని ప్రాంతంలో నిర్ణీత సమయంలోనే రోడ్లు, అధికార్ల వసతి గృహాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనిచేసి రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్లను, ఎల్‌పీఎస్ రోడ్లను, అధికారుల క్వార్టర్లను తగిన సమయానికి పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం ఉదయం అమరావతి రాజధాని వెంకటాయపాలెం గ్రామం మీదుగా వెళుతున్న సీడ్ యాక్సిస్ రోడ్ల నుంచి మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ అధికారులతో కలిసి ఈ-4, ఎస్-10 జంక్ష న్ నుంచి రోడ్లను పరిశీలిస్తూ ఈ-16, ఎన్-10 రోడ్డు జంక్షన్ వరకు వెళ్లారు. అనంతరం లింగాయపాలెం వద్ద ఎన్‌సీసీ క్యాంపులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన మా ట ప్రకారం సకాలంలో రాజధానిలో మొత్తం 1600 కి.మీ రోడ్లను పూర్తి చే యాలనే ఉద్దేశంతో పనులు వేగంగా జరుపుతున్నామన్నారు. అందుకోసం వారానికి రెండు సార్లు పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఉత్తరం నుంచి దక్షిణంకు మొత్తం 18 రోడ్లు, తూర్పు నుం చి పడమరకు 16 రోడ్ల నిర్మాణంతో కలిసి మొత్తం రాజధానిలో 32 రోడ్లు చేపట్టామన్నారు. దీనికి సంబంధించిన 220 కి.మీ రోడ్లకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని పనులు కూడా గ్రౌండింగ్ అయి వేగంగా జరుగుతున్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే ప్రారంభవౌతాయన్నారు. జూన్ 15 లోపు రోడ్లకు సంబంధించి గ్రావెల్ పనులు పూర్తి అయితే వర్షాకాలంలో మిగతా పనులు చేయడానికి వీలు అవుతుందన్నారు. వచ్చే మార్చి చివరి కల్లా అన్ని రోడ్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇ చ్చామన్నారు. వీటితో పాటు రాజధానిలోని 29 గ్రామాలలో రైతులకు లే అవుట్స్‌లలో ప్లాట్స్ వేశామన్నారు. ఎల్పీఎస్ రోడ్లకు సంబంధించి 40 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, మిగతా వాటికి కూడా త్వరలోనే టెం డర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రా జధానిలో వివిధ పనుల కింద 26 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్‌కి సంబంధించి డిజైన్స్ తుది దశలో ఉన్నాయని, జూన్ నెల మధ్య లో హైకోర్టుకి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, జూన్ నెల చివరికి అసెంబ్లీ కి టెండర్లు పిలుస్తామన్నారు. సిటీ సివి ల్ కోర్టు డిసెంబర్‌కు అందుబాటులోకి వస్తుందని, ఆల్ ఇండియా అధికారుల క్వార్టర్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కసారి స్లాబ్ వేస్తే నెలకు నాలుగు స్లాబ్స్ పూర్తి అవుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాం డ్ పూలింగ్ రోజున ఇచ్చిన మాట ప్రకా రం రాజధాని ప్రాంతంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు 3,840 క్వార్టర్స్‌ను నిర్మిస్తున్నామ ని అవి వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతాయన్నారు. మంత్రి పి.నారాయణతో రోడ్ల పరిశీలన కార్యక్రమంలో సీఆర్‌డీఏ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, ఏడీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భేష్!
* నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ర్యాంకు
* ఇండియాస్ క్లీనెస్ట్ బిగ్ సిటీ కేటగిరీలో ప్రథమ స్థానం
విజయవాడ (కార్పొరేషన్), మే 16: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగర పాలక సంస్థ మరో ర్యాంకు కైవసం చేసుకుంది. వివిధ అంశాల్లో నగరంలో చేపట్టిన సర్వేలో భాగంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన కేటగిరిలో నగరం ఇండియాస్ క్లీనెస్ట్ బిగ్ సిటీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈమేరకు సమాచారం అందుకున్న వీఎంసీ కమిషనర్ జే నివాస్‌ను వీఎంసీ సీఈ పి ఆదిశేషు, ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, కేఎస్ రామమూర్తి, తదితర ఇంజినీరింగ్ అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పలు అవార్డులు, ర్యాంకులు సాధించుకున్న వీఎంసీ ప్రస్తుతం బిగ్ సిటీ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.