విజయవాడ

ముస్లిం పారిశుద్ధ్య సిబ్బందికి రంజాన్ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 22: 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేష్ ఆధ్వర్యంలో నగరంలో పారిశుద్ధ్య విధులు నిర్వర్తించే ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం కృష్ణలంక ఎస్‌వి రెడ్డి మున్సిపల్ స్కూల్‌లో జరిగిన పంపిణీ కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ జే నివాస్ స్టీల్ క్యాన్, సేమియా, నెయ్యి, పాలు, పంచదార అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నివాస్ మాట్లాడుతూ పండుగలను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో కార్పొరేటర్ సురేష్ తన సొంత ఖర్చుతో రంజాన్ తోఫా అందజేయడం స్ఫూర్తిదాయకమన్నారు. నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు రావడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, వారి సేవలను గౌరవించడం ఆనందదాయకమన్నారు. కార్పొరేటర్ సురేష్ మాట్లాడుతూ నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు నిరుపమానమన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సిబ్బందికి రంజాన్ తోఫా అందించి వారిని సంతోష పెట్టడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సీవో సునీత తదితరులు పాల్గొన్నారు.

మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ
మహానాడు ఏర్పాట్ల పరిశీలన
పటమట, మే 22: కానూరు సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను మంగళవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహానాడు తరలివచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుందన్నారు. గద్దె అనురాధ వెంట రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ, ఏపీ టూరిజం ఛైర్మన్ జయరామిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.