విజయవాడ

ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలు తెలిపే బోర్డులుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ప్రతి స్కూలు మంచి వాతావరణం, ఉన్నతమైన విద్య అందిస్తుందనే భావన తల్లిదండ్రుల్లో వచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిఇఓ, ఎంఇఓ, హెచ్‌ఎంలకు సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆతిద్యనాధ్ దాస్, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్.సంధ్యారాణి, స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ సర్వశిక్షా అభియాన్ జి.శ్రీనివాసులతో కలిసి 13 జిల్లాల డిఇఓ, ఎస్‌ఎస్‌ఎ పిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గతం కంటే స్పష్టమైన మార్పు కన్పించే విధంగా ప్రతి ఒక్కరి నుండి స్పందన రావాలన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని వీటిని అమలుపర్చే బాధ్యత డిఇఓలు, ఎంఇఓలు, హెచ్‌ఎంపై వుందన్నారు. మనబడి-మనవూరు కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మూడు లక్షల మంది బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు మంత్రి వెల్లడించారు. జూలై మొదటివారంలో పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుందని పాఠశాల నిర్వహణలో ఏమైనా లోపాలు గమనిస్తే సంబంధిత డిఇఓ, ఎంఇఓ, హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రైవేటు స్కూలు నిర్వహణ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు వసూలు తెలిపే డిస్‌ప్లే బోర్డులు, స్కూలు బస్సు ఫిట్‌నెస్, జిల్లా, రెవెన్యూ, మండల స్థాయి కమిటీలు తీసుకుంటున్న చర్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ, మిడ్డేమీల్స్, ఇంకుడు గుంతలు, ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల నుండి బాలబాలికల ప్రవేశం నమోదు తదితర అంశాలను మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి, విజయవాడ డివైఇఓ కె.రవికుమార్‌లు పాల్గొన్నారు.