విజయవాడ

రోడ్డు విస్తరణకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జరుగుతున్న రహదారుల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. బుధవారం వీఎంసీ కౌన్సిల్ భవనంలో క్రీస్తురాజుపురం రోడ్డు భవన యజమానులతో నిర్వహించిన సమావేశంలో నివాస్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారికి అన్ని విధాలా న్యాయం చేస్తున్నామన్నారు. జోనల్ అభివృద్ధి ప్లాన్ ప్రకారం ప్రస్తుతం 50-60 అడుగులు ఉన్న ఈ రహదారిని 80 అడుగుల రహదారిగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగరంలో ఉన్న బందర్‌రోడ్డు, ఏలూరు రోడ్డును అనుసంధానం చేస్తూ ఆయా రోడ్లకనుగుణంగా క్రీస్తురాజుపురం రహదారిని కూడా అభివృద్ధిపర్చుతున్నామన్నారు. రోడ్డు విస్తరణలో స్థలం, భవనం కోల్పోతున్న యజమానులకు స్థలానికి అమలులో ఉన్న జీఓఎంఎస్ నెం 223, ఎంఎయుడీ శాఖ ప్రకారం 1:4 నిష్పత్తిలో భవన యజమానులకు టీడీఆర్ బాండులను మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే భవనం/ప్రహరీ గోడ కోల్పోతున్న వారికి ఆర్ అండ్ బీ వారిచే అంచనాల ప్రకారం ప్రతి నిర్మాణానికి పరిహారం చెల్లిస్తున్నామన్నారు. నగర అభివృద్ధి, రహదారుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని భవన యజమానులందరూ విస్తరణకు సహకరించాలని నివాస్ కోరారు. ఈ సమావేశంలో సీటీప్లానర్ బీ లక్ష్మణరావు, డెప్యూటీ సిటీ ప్లానర్ ధర్మారావు, అసిస్టెంట్ సిటీప్లానర్ తదితరులు పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్యను అందించాలి
* వీఎంసీ కమిషనర్ నివాస్
విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: వీఎంసీ పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే కాకుండా ప్ర స్తుత విద్యా సంవత్సరం పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాల ను అందించాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. వీఎంసీ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంలతో బుధవారం వన్‌టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ నివాస్ మాట్లాడుతూ 2017-18లో 93 శాతం ఉత్తీర్ణత సాధించగా, 33 మంది మాత్రమే 10/10జీపీఎ సాధించారని, ఈ ఫలితాలు కొంతవరకూ బాగానే ఉ న్నా రానున్న విద్యా సంవత్సరంలో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంకే బేగ్ ఉన్నత పాఠశాలలో అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించాలని, ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు, పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే 21 ఉన్నత పాఠశాల ల్లో విద్యాభ్యాసం చేసే బాలికల సౌకర్యార్థం శానిటరీ నాఫ్కిన్ వెండింగ్ మి షన్స్ కలిగిన మోడరన్ టాయిలెట్లను నిర్వహణ సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వీఎంసీ డీవైఈవో దుర్గాప్రసాద్, కో-ఆర్డినేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.