విజయవాడ

7శాతం పెరుగుతున్న పన్ను భారాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రజా రక్షణ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: నగర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, అందుకు ప్రతిఫలంగా వారినే శిక్షిస్తూ పన్ను భారాలు మోపుతోందని సీపీఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ స భ్యుడు దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నా రు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కన్నా అవినీతి అక్రమాలే ఎక్కువని దుయ్యబట్టిన కాశీనాథ్ ప్రతి ఏటా పెరుగుతున్న నీటి, డ్రైనేజీ ఇతర భారాలు 7శాతం పన్ను తగ్గింపులో విఫలమైన అధికార టీడీపీ చర్యలకు నిరసనగా ఈనెల 22 నుంచి నగరంలో ప్రజా రక్షణ యాత్ర నిర్వహించడమే కాకుండా ఆగస్టు 8న వీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భా రీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. 7శాతం పెరిగిన పన్నులతోపాటు టీడీపీ కానుకగా ఆయా పన్నులను వంద నుంచి 300శాతం వరకూ పెంచిందన్నారు. చెత్తను కూడా వదలకుండా దానిపై కూడా పన్ను వేసిన ఘనత ప్రస్తుత టీడీపీ మేయర్ శ్రీ్ధర్, ప్రజాప్రతినిధులకే దక్కిందని తెలిపా రు. చట్ట ప్రకారం 6నెలలకొకసారి చె ల్లించే పన్నును ఇప్పుడు ఒకేసారి సం వత్సరానికి ఒకేసారి వసూలు చేయ డం ప్రజలను దోచుకోవడమేనన్నారు. ఈ రీతిలో టీడీపీ నగర పాలక సంస్థ ప్రజల జేబులను కొల్లగొడుతోందన్నా రు. విజయవాడ పేరుకే రాజధానే అ యినా నగర ప్రజలకు ఒరిగిందేమీ లే దని, సరైన డంపింగ్ యార్డు లేక ము రికి కంపు కొడుతున్న పరిసరాలు, జ్వ రాలు, జబ్బులు, రాజ్యమేలుతుండగా, చిన్నపాటి వర్షానికే వీధులు మునిగి, డ్రైన్లు పొంగి పొర్లుతుండటంతో ప్రజ ల కష్టాలు వర్ణనాతీతమన్నారు. వీఎంసీకి బకాయిపడ్డ నగర బడాబాబుల నుంచి వసూలు చేయలేని పాలకులు సామాన్య ప్రజల నుంచి మాత్రం బలవంతంగా వసూలు చేస్తోందని, స్వ రాజ్య మైదానం విదేశీ కంపెనీకి అమ్మకానికి పెట్టగా, రాజీవ్‌గాంధీ పార్కు, ప క్కనే ఉన్న విద్యుత్ ఆఫీస్, సీతమ్మవారి పాదాల స్థలం నుంచి పద్మావతి ఘాట్ కృష్ణాతీరం మొత్తాన్ని టూరిజం పేరు తో ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని ఆరోపించిన కాశీనాథ్ టీడీపీ ప్రజా వ్య తిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి వా రిని చైతన్యపర్చేందుకే ప్రజా రక్షణ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. సెంట్రల్ సిటీ కార్యదర్శి డీ విష్ణువర్థన్, తూర్పు సిటీ కార్యదర్శి బీ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

దుర్గగుడిలో ఎస్మా చట్టం అమలు ఉత్తర్వులను రద్దు చేయాలి
* రైల్వేకాంట్రాక్ట్ వర్కర్స్
అండ్ ఎంప్లారుూస్ యూనియన్
విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పరిశుద్ధ పనుల్లోనూ, రవాణ, సెక్యూరిటీ ఎలక్ట్రికల్ క్షౌరవృత్తి తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులపై ఎస్మా చట్టం అమలుకు ఉత్తర్వులు ఇవ్వడం గర్హనీయమని రైల్వేకాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీఎల్ నరసింహులు, ఎస్‌ఎం సుభాని పేర్కొన్నారు. చట్టపరంగా అమలుచేయాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ, సెలవులు, గుర్తింపు కార్డులు తదితర వాటితోపాటు ఉద్యోగ భద్రతలపై కార్మికులు చేస్తున్న ఉద్యమం న్యాయసమ్మతం కాబట్టి, వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అలాగే వీరిపై ఎస్మా చట్టాని అమలుచేసే ప్రక్రియను రద్దు చేయాలని వారు కోరారు.