విజయవాడ

వర్షాలకు జిల్లాలో 78 ఇళ్లు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 20: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 78 ఇళ్లు దెబ్బతిన్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లావ్యాప్తంగా అందిన ప్రాథమిక సమాచారం మేరకు విజయవాడ రెవెన్యూ డివిజన్, నూజివీడు, గుడివాడ డివిజన్లలో 65గృహాలు పాక్షికంగాను, 13ఇళ్లు పూర్తిగాను దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన తదుపరి సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ డివిజన్‌లో 1162.9 మిల్లీ మీటర్లు, గుడివాడ డివిజన్‌లో 344 మిల్లీమీటర్లు, నూజివీడు డివిజన్‌లో 1267.20 మిల్లీ మీటర్లు, బందరు డివిజన్‌లో 340 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలోని ఆత్కూరు డ్రైన్‌కు గండిపడి 25ఎకరాలు నీటమునిగాయని తెలిపారు. నూజివీడు డివిజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రెండు పశువులు విద్యుత్ షాక్‌తో చనిపోయాయన్నారు. 42 కిలోమీటర్ల మేర రోడ్లు ద్వంసం కాగా రెండు చెరువులకు, ఒక కాల్వకు గండ్లు పడగా వెంటనే వాటిని పూడ్చివేసి పునరుద్ధరించామన్నారు. తిరువూరు, ఏ కొండూరు మండల గ్రామాలలో పర్యటించి ముంపునకు గురైన ప్రాంతాలను రెవెన్యూ అధికారులతో పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ విజయకృష్ణన్ లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షం నీటిని తోడించడమే కాకుండా డ్రైన్లలో పూడికలు తీయాలని ఆదేశించారు.

నీట మునిగిన పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ‘జోగి’
బంటుమిల్లి, ఆగస్టు 20: జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యానికి రె తులు బలైపోవాలా అంటూ పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. సోమవారం మండల పరిధిలో ని అర్తమూరు, బాసినపాడు ప్రా ంతాలలో మునిగిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జా తీయ రహదారి అధికారులు జాతీయ రహదారి పనులను ఇష్టానుసారం చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని రైతుల పొలాలకు వర్షం నీరు చేరి పో యే మార్గం లేక పంట పొలాలు ము ంపునకు గురవుతున్నాయని ధ్వజమెత్తారు. నేషనల్ హైవే అధికారుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. అనంతరం తాహశీల్దార్ డివి శేఖరరావు, ఎస్‌ఐ కె శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల నాయకులు సంగా మధుసూధనరావు, మండల నాయకులు మలిశెట్టి రా జబాబు, బొర్రా రమేష్, తోకల స్వాములు తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా సహాయక చర్యలు: మంత్రి కొల్లు
మచిలీపట్నం, ఆగస్టు 20: అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధిక వర్షాలకు ముంపునకు గురైన 38, 42 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మంత్రి రవీంద్ర పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి తక్షణ సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అధికంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వైద్య పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వర్షాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున వరద ఉధృతి ఎక్కువగా ఉందని, వరద నీటిని కిందకు విడుదల చేయటం జరుగుతుందని, లంక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ పర్యటనలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమీషనర్ సంపత్ కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు గనిపిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.