విజయవాడ

సెమీస్‌కు టీటీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 11: నగరంలోని దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 11స్పోర్ట్స్ జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ సౌత్‌జోన్ చాంపియన్‌షిప్ పోటీలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో వౌసుమిపాల్ (పీఎస్‌పీబీ), సగరిక ముఖర్జీ (రైల్వే), అర్చనకామత్ (పీఎస్‌పీబీ), సుతిర్తాముఖర్జీ (హార్యానా)లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం జరగిన క్యార్టర్ ఫైనల్స్‌లో నగరానికి చెందిన శైలూనూర్‌భాషా జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారతజట్టు సభ్యురాలు సుతిర్తాముఖర్జీ చేతిలో ఒటమి చెందింది. అంతకు ముందు ఫ్రీక్వార్టర్ ఫైనల్స్‌లో ఒలింపియన్ అంకితదాస్‌ను 4-3 తేడాతో ఒడించి మొదటిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఒలింపియన్ అంకితదాస్‌కు మొదటి నుండి అవకాశం ఇవ్వకుండా తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించింది. యూత్ బాలికల విభాగంలోను శైలూనూర్‌భాషా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో ఆకులశ్రీజ (ఆర్‌బిఐ)పై 9-11, 11-8, 4-11,11-6,11-7,11-7 తేడాతో వౌసుమిపాల్, దివ్యదేశ్‌పాండే (పీఎస్‌పీబీ)పై 12-10,12-10, 7-11,11-7,7-11,5-11,16-14 తేడాతోసాగరికముఖర్జీ (పీఎస్‌పీబీ), రీత్‌రిష్యపై 11-6,6-11,11-7,11-7,11-7 తేడాతో అర్చనాకామత్, శైలూ నూర్‌బాషాపై 11-5,11-7,11-4,11-8 తేడాతో సుతిర్తా ముఖర్జీలు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల విభాగంలో అమల్‌రాజ్, సుధన్‌షూ, సుస్మిత్‌శ్రీరామ్, అనంత్ దేవరాజన్‌లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. బుధవారంతో పోటీలు ముగియనున్నాయి.