విజయవాడ

దసరా ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 25: రానున్న దసరామహోత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధి, కనకదుర్గనగర్, దుర్గా ఘాట్ పనులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు పరిశీలించారు. మంగళవారం ఉదయం చైర్మన్ వి గౌరంగబాబు కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద ప్రారంభం కానున్న క్యూలైన్లు పనులు, కనకదుర్గనగర్‌లోని జరుగుతున్న పనులు, తదితర వాటిని పరిశీలించారు. ఇందులోభాగంగానే దుర్గా ఘాట్‌ను పరిశీలించారు.
29వరకు ఘాట్‌రోడ్ మూసివేత
దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గగుడి ఘాట్‌లో వివిధ రకాల పనులు చేపట్టిన కారణంగా ఈ నెల 29వ తేదీ వరకు ఘాట్‌రోడ్‌ను మూసివేస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వి కోటేశ్వరమ్మ తెలిపారు. పనుల కారణంగా కేవలం రెండు రోజులు మాత్రమే ఘాట్‌రోడ్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకొని గత రెండురోజులుగా భక్తులను శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్ద లిఫ్ట్ ద్వారా కొండపైకి అనుమతిస్తున్నట్లు వివరించారు. పనులు పూర్తి కానీ కారణంగా ఈనెల 29వ తేదీవరకు భక్తులు లిఫ్ట్ మార్గం ద్వారానే కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని దేవస్థానం వారితో సహకరించాలని ఈవోభక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఉత్సాహంగా స్వచ్ఛతే సేవ
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 25: స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, రాఘవయ్యపార్కులను శుభ్రం చేశారు. మంగళవారం ఉదయం ఆర్టీసీ డీఎం నాగేంద్ర బాబు నేతృత్వంలో పలువురు అధికారుల బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే నగరంలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు రైల్వే స్టేషన్, రాఘవయ్యపార్కులో గల చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపర్చారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ అర్జునరావు, ఎఎంహెచ్‌ఓలు డాక్టర్ ఎస్ రాజు, ఇక్బాల్ హుస్సేన్, శానిటరీ సూపర్‌వైజర్లు పలువురు పాల్గొన్నారు.