విజయవాడ

దసరా నిర్వహణపై సీసీ కెమెరాల డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 13: దసరా ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మ అమ్మవారిని కొలిచే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేశామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి దసరా ఉత్సవాలలో భక్తులకు అందుతున్న సేవలను సీసీ కెమెరాల ద్వారా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, దేవదాయశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో దసరా ఉత్సవాలలో భక్తులకు సేవలు అందిస్తున్నారన్నారు. భక్తుల క్యూలైన్ల వద్ద, అంతరాలయం, అన్నదానం మొదలగు ప్రాంతాలలో ఏ సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారనేది పర్యవేక్షించమని తెలిపారు. పరిస్థితిని అంచనా వేసి మంచినీరు, ఇతర సౌకర్యాలు భక్తులకు ఎక్కడైనా కొరత ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీచేస్తున్నారు.

భక్తుల సౌకర్యాలకే పెద్దపీట
* ఈవో కోటేశ్వరమ్మ
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 13: దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని ఆ దిశలో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నారని ఆలయ కార్యానిర్వహణాధికారి వీ కోటేశ్వరమ్మ తెలిపారు. ఇందుకు నిదర్శనంగా శనివారం ఆలయంలో 4వరోజు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రద్ధీని దృష్టిలో పెట్టుకుని సౌకర్యవంతమైన దసరా ఏర్పాట్లపై అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు ఎండ పడుతున్న ప్రాంతాన్ని ఈవో పరిశీలించారు. అనంతరం సదరు క్యూలైను పైభాగంలో టార్పాలిన్‌ను ఏర్పాటు చేసి భక్తులపై ఎండ పడకుండా రక్షణ కల్పించారు. మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని రద్దీని తట్టుకునేలా అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.