విజయవాడ

సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 13: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేసే అంశంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు కే పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కాకుండా మూడో ప్రత్యామ్నాయం అవసరమన్న ఆయన దాన్ని పూరించేది కేవలం జనసేనతోనే సాధ్యమన్నారు. నగరంలోని గాయత్రి నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన సీపీఐ, సీపీఎం నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై సుదీర్ఘంగా ఆయన నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటిపై కమ్యూనిస్టు పార్టీల పెద్దలతో చర్చించారు. ముఖ్యంగా కరవు సమస్యలతో పాటు ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం, తదితర 8 అంశాలపై చర్చలు జరిపారు. సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అన్ని అంశాలపై పార్టీ నేతలతో చర్చించి రెండురోజుల్లో దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తానని పవన్ కళ్యాణ్ వామపక్ష నేతలకు చెప్పారు. ముఖ్యంగా కౌలు రైతులు, నిర్వాసితులు, పంచాయతీ ఎన్నికలు, రాయలసీమ కరువు, మున్సిపల్ కార్మికుల సమ్మె, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, 175 నియోజకవర్గాల్లో గుర్తించిన సమస్యలపై ఉమ్మడి ప్రణాళిక వంటి అంశాలను చర్చించారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టుగా మార్చేందుకు పోరాటం చేసే అంశాన్ని కూడా 3గంటల పాటు మూడు పార్టీల నేతలు చర్చించారు. ఈనెల 15న జనసేన పార్టీ ధవలేశ్వరం బ్యారేజీపై నిర్వహిస్తున్న జన కవాతుకు వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీకి కవాతుకు పార్టీల తరుపున సంఘీభావం తెలిపినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో చర్చించిన అంశాలపై మూడు పార్టీలు కలిసి ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తాయని ప్రకటించారు. రాష్ట్రంలో రెయిన్‌గన్స్‌తో కరవు పారద్రోలామని సీఎం చంద్రబాబు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 175 నియోజకవర్గాల్లో గుర్తించి సమస్యలపై, రాబోయే రోజుల్లో ఓ ప్రణాళిక బద్దంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.