విజయవాడ

లక్ష కోట్లతో ప్రపంచ రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 14: నవ్యాంధ్ర రాజధానిని లక్ష కోట్ల రూపాయలకు పైగా అంచనాలతో నిర్మాణ పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తొలి దశలో రూ. 48వేల 126 కోట్లతో పనులు చేపట్టామన్నారు. కేంద్రం సహకరించకపోయినా భూములే పెట్టుబడిగా అమరావతిని ప్రపంచ నగరంగా ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. బుధవారం సాయంత్రం రాజధాని గ్రామాల్లో జరుగుతున్న పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. రాయపూడిలో ఐఏఎస్ క్వార్టర్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. డిజైన్లను, 12 అంతస్థుల మోడల్‌ను పరిశీలించారు. క్వార్టర్లలో మూడో అంతస్తులో పూర్తిస్థాయి నిర్మాణం జరిగిన గృహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కిచెన్‌లో మార్పులు చేయకుండా అందరి అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్ అమర్చాలని సూచించారు. అనంతరం శాఖమూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకానున్న పార్క్ పనులు, నిర్మాణంలో ఉన్న రహదార్లను తనిఖీ చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం త్వరితగతిన జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని మొత్తంగా ఐకనిక్ భవనాలు, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, ఎన్జీవో కాలనీ, ఐఏఎస్‌ల క్వార్టర్లు, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీల నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 13వేల మంది కార్మికులు రాజధాని నిర్మాణం కోసం పగలు, రాత్రిళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. కృష్ణానది నుంచి శాఖమూరు వరకు అతి పెద్ద పార్కు ఏర్పాటవుతోందని చెప్పారు. ఐదు టవర్లలో సచివాలయ భవనాల పనులు ప్రారంభమయ్యాయని పాలనా విధానంలో ఇకపై మార్పులు తీసుకువస్తామన్నారు. కృష్ణానదితో పాటు అద్భుతమైన జలవనరులు, నాగరికతకు అనువైన అవకాశాలు అమరావతిలో ఉన్నాయని హైదరాబాద్‌లో అవుటర్ రింగ్‌రోడ్డు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాలను తీసుకు వచ్చామన్నారు. ఇప్పుడు తాను హైదరాబాద్‌ను కోరుకోక పోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిందలు మోపుతున్నారో అర్థం కావటంలేదన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా కోర్టులో కేసులువేసి ఇబ్బందులు పెట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా అచంచలమైన విశ్వాసంతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూగర్భ కేబుళ్లు ఉంటాయన్నారు. డ్రెయిన్లు కనిపించవన్నారు. సెంట్రల్ ఏసీ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. ముంపు సమస్య తలెత్తకుండా పర్యావరణ హితమైన నగరంగా అమరావతి ప్రపంచ ఖ్యాతి గడించేలా సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు. ప్రస్తుతం 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ట్రంక్ రోడ్లకు రూ 4067 కోట్లు, ఐపీఎస్‌ల క్వార్టర్లకు రూ 8వేల 120 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మొత్తం 12వేల 200 కోట్ల పనులు అవార్డు దశలో ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ కల్లా హైకోర్టు భవనాలు (జస్టిస్ సిటీ) పూర్తవుతుందని, జనవరిలో ప్రారంభించాల్సిందిగా చీఫ్‌జస్టీస్‌ను కోరనున్నట్లు తెలిపారు. లండన్, దుబాయ్, హాంకాంగ్ తరహాలో జస్టిస్ సిటీ నిర్మితమవుతోందని వివరించారు. నవ నగరాలతో పాటు 27 టౌన్‌షిప్‌లు నిర్మిస్తామన్నారు. గుజరాత్ రాజధానిలోకి పులులు వచ్చాయని అది నివాస యోగ్యం కాదన్నారు. అమరావతిలో అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే వీలుందన్నారు. అన్నివర్గాల వారికి రాజధానిలో గృహనిర్మాణం చేపట్టామని 3840 ఇళ్లు మార్చి నాటికి పూర్తి కాగలవన్నారు. రాజధాని నగరాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు బోట్‌రేస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశీయులకు సైతం నివాసాలు ఏర్పాటు చేసుకునే విధంగా అమరావతిలో సౌకర్యాల కల్పన జరుగుతుందన్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ విమానాన్ని తీసుకు వచ్చేందుకు ఎంతో శ్రమించామని అమరావతిలో మరింత ప్రయత్నిస్తున్నా అనుమతులు రావటంలేదన్నారు. వయబులిటీ గ్యాప్ ఇస్తామని ఇండిగో సంస్థను తీసుకు వచ్చామన్నారు. కస్టమ్స్ అనుమతికి అనేక రకాల అడ్డంకులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది.. భూములను సద్వినియోగం చేయటం ద్వారా రెవెన్యూ వస్తుందన్నారు. కేంద్రానికి రూ 6వేల కోట్ల జీఎస్టీ చెల్లిస్తున్నామని ఇకపై మంచిరోజులు వస్తాయనే నమ్మకం తమకు ఉందన్నారు. ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి కోసం అప్పులు చేస్తున్నాం.. ఎకానమీ ద్వారా వాటిని తీర్చగలమనే ధీమా వ్యక్తం చేశారు.