విజయవాడ

సిఎం చంద్రబాబు దృష్టికి విధ్వంసక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 3: కృష్ణ పుష్కరాలు, నగరాభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ విధ్వంసక చర్యలకు పాల్పడి హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్న అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు బిజెపి నేతలు తెలిపారు. మల్లిఖార్జున పేట గోశాల ఆవరణలో ఆదివారం ఉదయం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పేరుతో వివిధ ఆలయాలను ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కూల్చివేస్తూ విగ్రహాలను వియంసి వ్యాన్‌లో తీసుకువెళ్లి తీవ్రమైన అపచారం చేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఆలయాల కమిటీలకు ముందుగా ఎటువంటి నోటీస్‌లు ఇవ్వకుండా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కూల్చివేస్తూ హిందువుల మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలిగించే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. కూల్చిన ఆలయాలను బదులుగా మరొకచోట స్థలాన్ని కేటాయించి ఆగమ శాస్త్ర ప్రకారం తిరిగి ఆలయాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఆలయాలను కూల్చివేసే విషయంలో కమిటీ చైర్మన్‌లను ఆయన కార్యాలయానికి పిల్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ ప్రజాప్రతినిధిపై కూడా సియంకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు వివరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఆలయాలను తొలగింపులో ఏకపక్షంగా చేపడుతున్న చర్యలను సైతం ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. గోదావరి పుష్కరాల మహోత్సవాలు జరిగిన సమయంలో రాజమండ్రిలో ఒక ఆలయాన్ని కూడా తొలగించలేదని ప్రత్యేకంగా విజయవాడ పాతబస్తీలోనే ఎందుకు ఆలయాలను తొలగిస్తున్నారని వారు ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు ఒక న్యాయం, కృష్ణ పుష్కరాలకు మరొక న్యాయం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈసమావేశంలో మాజీ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, స్టేట్ సెక్రటరీ సురేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు డి ఉమామహేశ్వరరాజు, ఉపాధ్యక్షులు సూరే సుబ్బారావు, బిఆర్ పట్నాయక్, మాజీ కార్పొరేటర్ కె గణేష్, గోశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నాయకులు కెనాల్‌రోడ్ వినాయకుని గుడి, సీతమ్మవారి పాదాల చెంత ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామి ఆలయం, భూగర్భ వినాయకుడి, అంజనేయస్వామి ఆలయంతోపాటు పలు చిన్న చిన్న ఆలయాలను సైతం పరిశీలించి ఆలయాల కమిటీ చైర్మన్‌లు, సభ్యులతో మాట్లాడారు.