విజయవాడ

ఐదు కొత్త ట్రాఫిక్ బైక్‌లు ప్రారంభించిన సీపీ ద్వారకా తిరుమలరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 20: నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్న నగర పోలీసుశాఖ మరో అడుగు ముందుకేసింది. ట్రాఫిక్‌కు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ‘పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం’లో భాగంగా సరికొత్త ట్రాఫిక్ బైక్‌లను రోడ్డుపైకి తీసుకువచ్చింది. అన్ని హంగులతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మోటారు సైకిళ్ళను సుజుకీ మోటారు సైకిల్స్ ఆఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నగర పోలీసుశాఖకు బహూకరించింది. ఈ వినూత్నమైన ఐదు మోటారు సైకిళ్ళను నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పైలట్ ప్రాజెక్టుగా తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక వాహనాలకు మైక్‌తోపాటు సైరన్, ఎమర్జెన్సీ లైట్, కంట్రోల్ బాక్స్, పవర్‌బ్యాంక్, ఛార్జింగ్ తదితర సౌకర్యాలు అమర్చారు. నగరంలో సంచరిస్తూ ట్రాఫిక్ సమస్యలను అంచనా వేయడం, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి విధులు నిర్వహించనున్నాయి. ప్రారంభం సందర్భంగా వరుణ్ గ్రూప్ ఈడీ వినోద్‌కుమార్, పద్మజా సుజుకీ సీఈఓ అనురాధ, ఏరియా మేనేజర్ పునీత్, సేల్స్ మేనేజర్ ప్రసాద్‌లను పోలీసు కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ వై రవిశంకర్‌రెడ్డి, ఏసీపీలు డి శ్రావణ్‌కుమార్, శివరామరెడ్డి, సిఐ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎకరానికి 49బస్తాలు
పెనమలూరు, నవంబర్ 20: గ్రామానికి సరాసరి ఎకరాకి ఎంత దిగుబడి వస్తోందో తెలుసుకోడానికి పంటకోత ప్రయోగంలో భాగంగా కిలారు ప్రసాద్ అనే రైతు పొలంలో కొలతలు వేశామని, ఎకరాకి 49బస్తాలు ధాన్యం పండినట్లు గుర్తించామని మండల వ్యవసాయ శాఖాధికారి ఎల్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. పోరంకి గ్రామంలోని నలుగురు రైతులను పంటకోత ప్రయోగం చేయడానికి అధికారులు ఎంపిక చేశారు. నలుగురి పొలాల్లో ఎంటీయు 1061 అనే వరి రకం విత్తనాలు వేశారు. కిలారు ప్రసాద్ పొలం కోతకు రావటంతో శ్రీనివాస్ పర్యవేక్షణలో కోత కోసి నూర్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కోత ప్రయోగంలో భాగంగా పరిశీలించగా 52 బస్తాలు దిగుబడి వచ్చినట్లు తెలిసిందన్నారు. ధాన్యం ఎండిన తరువాత నికరంగా 49 బస్తాలు వచ్చినట్లు తేలుతుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు, రైతు పండించే విధానంపై పంట దిగుబడి ఆధారపడి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి సూర్యభవాని, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఫీల్డ్ అసిస్టెంట్ డేవిడ్ పాల్గొన్నారు.

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం
రాజకీయ పక్షాలు మద్దతివ్వాల్సిందే
* లాకా వెంగళరావు యాదవ్ డిమాండ్
విజయవాడ, నవంబర్ 20: జాతీయ స్థాయిలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయిలో ఉన్న 35 రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ‘చట్టసభల్లో రిజర్వేషన్లు’ అంశంపై బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తొలుత ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 123సార్లు సవరించారని, 56శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించటానికి అవసరమైతే మరోసారి సవరించాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించక పోవడం బీసీలను విస్మరించడమేనన్నారు. తమకు అన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. వేణుమాధవ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వెంకటసత్యం, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బోను దుర్గానరేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యలగాల నూకాలమ్మ, బీసీ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారు రాజేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షుడు పలగాని హరీష్, తదితరులు మాట్లాడారు.