విజయవాడ

ముందు ప్రజలకు కనిపించి తర్వాత విమర్శలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 3:ముందు మీరు మీనియోజకవర్గానికి వెళ్ళి ప్రజలకు కనిపించండి తర్వాత మాపై విమర్శనలు చేయండి అంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానీ యంపి గోకరాజు గంగారాజుకు సలహా ఇచ్చారు. యంపి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యంపి నాని మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరు సహకరించాలన్నారు. ప్రజలను మోసం చేసి ఇప్పుడు స్వామివేషంలో ఉన్న దొంగస్వామిని అడ్డుపెట్టుకొని రాష్టమ్రుఖ్యమంత్రి అవాకులు-చెవాకులు పేల్చటం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. గోసాలషేడ్‌ను తొలగించినందుకు తగురీతిలో నష్టపరిహారం ఇచ్చేందుకు ఇప్పటికే కలెక్టర్ నివేదిక సైతం తయారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. తొలగించిన ఆలయాలను అన్నింటిని ఒకేచోట ప్రభుత్వ ఖర్చుతో నిర్మించేందుకు ఇప్పటికే సియం చంద్రబాబునాయుడు ఆమోదించినట్లు వివరించారు. అధికారం కోసం బిజెపిలోనికి వచ్చిన నేతలు తప్ప సియం చేస్తున్న అభివృద్ధిపనులు నిజమైన బిజెపి నేతలు ఎవరు విమర్శించటం లేదని యంపి ఈసందర్భంగా గుర్తు చేసారు. కెనాల్‌రోడ్ వినాయకునిగుడి, విజయేశ్వరస్వామి ఆలయం, తదితర ఆలయాలను తొలగించనున్నట్లు గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేవలం ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి,స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి తప్పుడు సంకేతాలకు ప్రజలకు చేరవేయటం ఎంతవరకు సమంజమని యంపి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సుమారు 300 ఆలయాలను తొలగించినప్పుడు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న బిజెపి నాయకులు అప్పుడు ఎందుకు నోరుమోదపలేదని ప్రశ్నించారు. భారతదేశ అత్యుత్తమైన న్యాయస్ధానమైన సుప్రీమ్‌కోర్టు అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఏరకమైన మందిరాలు ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయమని తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈసందర్భంగా వివరించారు. మిత్రపక్షపార్టీ ఉన్న బిజెపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సహాకారాన్ని అందించటం పోయి లేనిపోని ఆరోపణలు చేయటం వలన రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు పారిశ్రామితవేత్తలు భయపడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ గతంలో గుండాలు,రౌడీలకు నిలయంగా ఉన్న విజయవాడ నగరం నేడు అభివృద్ధి వైపుశరవేగంతో దూసుకుపోతుండగా బిజెపి ముసుగు వేసుకున్న కొంతమంది నాయకులు వలన అభివృద్ధికి విఘాతం కలుగుతోందన్నారు. గోసాల కమిటీ అధ్యక్షుడు చింతలపూడి రఘురామ్ మాట్లాడుతూ వెలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్‌పార్టీలో ఉన్న సమయంలో గోసాలలో ఉన్న ఆవులను ఇక్కడ నుండి తరలించేందుకు అప్పటి రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేఖ వ్రాసిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేసారు. ఇప్పుడు కొత్తగా గోసాల ఆవులపై ప్రేమ ఉన్నట్లుగా ప్రచారం చేసుకొంటూ నగరాభివృద్ధికి తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కార్పోరేటరులు చెన్నుపాటి గాంధీ, ఉమ్మడి వెంకటేశ్వరరావు, అర్బన్ నాయకులు పట్ట్భా, కాళ్ళేనాగేశ్వరరావు, మాజీ కార్పోరేటర్ కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు.