విజయవాడ

బిజెపి ప్రెస్‌మీట్ రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 3: మల్లిఖార్జున పేట గోశాల ఆవరణలో ఆదివారం ఉదయం బిజెపి నేతలు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రంగ ప్రవేశంతో ఉద్రికత్త పరిస్థితులకు దారితీసి చివరకు రసాభాసగా మారటంతో బిజెపి నేతలు వెళ్లిపోయారు. కృష్ణ పుష్కరాలు, నగరాభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా పాతబస్తీలో తొలగించిన ఆలయాలు, గోశాల సగభాగం తొలగింపును పరిశీలించిన బిజెపి నేతలు మల్లిఖార్జునపేట గోశాల ఆవరణలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అర్జున వీధిలోని 100 అడుగుల రోడ్ విస్తరణలో అధికారులు సమన్యాయం పాటించలేదని పరోక్షంగా ఎదురుగా ఉన్న ఇళ్లను ఎందుకు తొలగించలేదని అకారణంగా గోశాల షెడ్‌ను కూల్చివేశారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న అధికారపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వాస్తవాలను తెలియకుండా మాట్లాడవద్దని కేవలం కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది చేస్తున్న ప్రచారం నమ్మరాదని బిజెపి నేతలకు సూచించారు. ఇదే సమయంలో మాజీ కార్పొరేటర్ సంపర రాంబాబు వచ్చి అర్ధరాత్రి పూట కలెక్టర్ బాబు ఎ వచ్చి ఇళ్లను కూల్చాలని పొక్లెయిన్ పెడితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు అర్జునవీధిలో మిగిలి ఉన్న ఇళ్లను తొలగించాలని చెప్పటం ఎంతవరకు సమంజమని వారిని నిలదీశారు. దీంతో ఇప్పటికే తొలగింపు జాబితాలో ఉన్న ఇళ్ల యజమానులు వచ్చి వెంకన్న, రాంబాబుకు మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలోప్రెస్‌మీట్ తర్వాత మాట్లాడతాం అంటూ బిజెపి మాజీ కార్పొరేటర్ వ్యాఖ్యానించటంతో చిర్రెత్తుకొచ్చిన దేశం కార్యకర్తలు ఇప్పుడే మాట్లాడాలి అంటూ దూసుకురావటం ఇటు బిజెపి కార్యకర్తలు కూడా ముందుకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా గందరగోళ పరిస్థితులకు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన బిజెపి నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఎసిపి రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకోవటంతో సమస్య సద్దుమణిగింది.