విజయవాడ

తెలుగు ఇంజనీర్‌ను విడిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 4: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ సాయిశ్రీనివాస్‌ను కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా విడిపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. కిడ్నాప్‌కు గురైన సమాచారం తెలిసినప్పటి నుంచి అతని కుటుంబం అంతులేని క్షోభను అనుభవిస్తోందని, వెంటనే యువ ఇంజనీర్ ఆచూకీ కనుక్కుని ముష్కరుల బారి నుంచి విడిపంచేలా నైజీరియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సోమవారం ఆయన సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో కోరారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నైజీరియాలో భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డితో టెలిఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నైజీరియాలోని జిబొకులో అపహరణకు గురైన సాయిశ్రీనివాస్ ఆచూకీ కనుగొనడంలో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో వివరంగా తెలుసుకున్నారు. నైజీరియా ఫెడరల్ ప్రభుత్వంతో, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వంతో, డటగూటి సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సాయిశ్రీనివాస్‌ను విడిపిస్తామని బిఎన్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు భారతీయుల్ని చెర నుంచి విడిపించేందుకు వీలైనంత త్వరగా అన్ని ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి బాబు బిఎన్ రెడ్డికి సూచించారు.