విజయవాడ

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాది, జూలై 4: కృష్ణా పుష్కరాలకు సాధ్యమైనంత వరకు దుర్గగుడి అభివృద్ధి పనులను పూర్తిచేసేలా వేగవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్‌చార్జ్ ఇవో ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సోమవారం ఉదయం ఆయన రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటివరకు దుర్గగుడిలో జరిగిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. తర్వాత కొండపై నుండే గోశాల స్థలం, మల్లిఖార్జున మహామంటపం ద్వారా కొండపైకి చేరుకుంటున్న భక్తులు, అర్జున వీధి, పురావస్తు శాఖకు చెందిన స్థలాలను పరిశీలించారు. దుర్గగుడి కొండపై సాధ్యమైనంత వరకు పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని, ఇందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక బస్‌లో సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దుర్గగుడి సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకోటానికి సకల ఏర్పాట్లు చేశారు. తర్వాత దుర్గఘాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చంద్రబాబు పరిశీలించారు. ఈసందర్భంగా ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల వివరాలను జిల్లా కలెక్టర్ బాబు.ఎ సిఎంకు వివరించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, సిపి గౌతమ్ సవాంగ్, సబ్ కలెక్టర్ డాక్టర్ జి సృజన, నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.