విజయవాడ

ఐటి ఆధారిత వౌలిక వసతులపై సిఆర్‌డిఎ, జపాన్ ప్రతినిధుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: నూతన రాజధాని అమరావతిలో ఐటి అధారిత వౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలన్న అంశంపై సోమవారం ఏపి సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో జపాన్ ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలు, పోలీసు శాఖ, ఏడిసి, ఎపిఎస్ ఆర్డీసీ, రాజధాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్లతో సమావేశం జరిగింది. అమరావతిలో వౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి సాంకేతిక తోడ్పాటును అందించేందుకు జపాన్ ప్రభుత్వం ఆసక్తితో ఉన్నందున జపాన్ ప్రభుత్వానికి చెందిన మేటీ, సుమిటొమో కార్పొరేషన్, వారి సహచర సంస్థలైన ఎన్‌ఈసి, నిప్పాన్ సిగ్నల్, ఇంటర్నెట్ ఇనీషియేటివ్, టోషిబో కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని అమరావతి రాజధానిలో ఐటి ప్యాకేజ్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో వివిధ సాంకేతిక అంశాలైన ఇన్ఫ్‌ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డాటా సెంటర్స్, వీడియో కెమెరాలు, సిసి టివిల ద్వారా భద్రత ఏర్పాట్లు, పటిష్ట రవాణా వ్యవస్థ, వాహన రద్దీ సమాచారం, కంట్రోలింగ్ వ్యవస్థ, సక్రమమైన మార్గంలో వాహనాలు నడిపేందుకు విధివిధానాలు, ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం, ఆధునాతన వాతావరణ రాడార్‌తో వరద నిర్వహణ అమలు పరచే విధివిధానాలపై కూలంకషంగా చర్చించారు. సమావేశంలో విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, సిఆర్‌డిఏ అదనపు కమిషనర్ వి రామమనోహరరావు, సిఈ డి కాశీవిశే్వశ్వరరావు, ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు, డవలప్‌మెంట్ కంట్రోల్ రాముడు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ్ధర్, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ గణేష్‌బాబు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్ అరవింద్, ఆర్టీసీ కార్య నిర్వాహక సంచాలకులు కోటేశ్వరరావు, జయురావు, విజయవాడ ట్రాఫిక్ డిసిపి కాంతా రాణా, ఏడిసి సిటివో సుదర్శన రెడ్డి, రాజధాని నగర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్లు ఆర్వీ అసోసియేట్స్, జిఐఐసి ప్రతినిధులు పాల్గొన్నారు.