విజయవాడ

ఏషియన్ కాంటినెంటల్ చెస్‌లో లలిత్‌కు 8వ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 18: ఫిలిప్పైన్స్‌లోఈనెల 10 నుండి 18వతేదీ వరకు జరిగిన 17వ ఏషియన్ కాంటినేంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో చదరంగ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు 8వస్థానంలో నిలిచాడు. ఈచాంపియన్‌షిప్‌లో మొత్తం 64 మంది క్రీడాకారులు తలపడగా లలిత్‌బాబు 21వ ర్యాంకర్‌గా అడుగుపెట్టి 8వర్యాంక్‌లోనిలిచాడు. 2529 రేటింగ్‌తో ఉన్న లలిత్‌బాబు ఈ చాంపియన్‌షిప్‌లో 9 రౌండ్లలో17 పాయింట్లు రేటింగ్‌ను సాధించాడు. ప్రస్తుత రేటింగ్ 2546కు చేరింది. 2600 రేటింగ్ సాధిస్తే సూపర్ గ్రాండ్ మాస్టర్ అయ్యే అవకాశం ఉంది. 9వ రౌండ్ డ్రా చేయడంతో వరల్డ్ కప్‌కు వెళ్ళే అవకాశం చేజారింది.

సమకాలీన అంశాలపై అవగాహన అవసరం
*వీఐటీ చాన్సలర్ డాక్టర్ విశ్వనాథన్
లబ్బీపేట, డిసెంబర్ 18: మారుతున్న కాలంలో విద్యతోపాటు సమకాలిన అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన అవసరమని విఐటి చాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధన్ అన్నారు. విఐటీలో విద్య అంటేనే విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా ఉంటుందని, క్యాంపస్ ఇంటర్వూలలో లిమ్కాబుక్ ఆఫ్ రికార్ట్స్ సాధించామని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సీటీలకు తీసిపోని విధంగా విఐటీ కరిక్యులం ఉంటుందని, చదువుకునే వారికి విద్యతోపాటు ఉపాధి లభించేలా చూడటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విఐటీ ఎపి విశ్వవిద్యాలయం వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పనె్నండు యూనివర్సీటీలతో ఒప్పందం చేసుకుందని దీని ద్వారా విద్యార్ధులు ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ పోగ్రాం ద్వారా ఆయా కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. విఐటీ బిజినెస్ స్కూల్ ఈ సంవత్సరం బిబిఎ బిజినెస్ ఎనలటిక్స్ కోర్సుని ప్రారంబిస్తున్నామని దీని కోసం ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు అదే విధంగా ప్రఖ్యాత యానిమేషన్ సంస్థ టూన్జ్‌తో కలిసి యానిమేషన్ డిప్లొమా కోర్సుని తీసుకురానున్నామని తెలిపారు. అదే విధంగా తమ విద్యార్థి ఏ దేశంలో చదువుకున్నా అక్కడి స్థానిక భాష అనర్గళంగా మాట్లాండేందుకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. విఐటీ ఎపి యూనివర్సీటీలో ఇప్పటికే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ డిజిటల్ పాడ్స్ ద్వారా నిర్వహిస్తున్నామని ఇంజనీరింగ్ క్లినిక్స్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీస్తున్నామని ఇవి విఐటీ ఎంపి యూనివర్సిటీ ప్రత్యేకతలు అని రానున్న రోజుల్లో విఐటి ఎంపి యూనివర్సిటీ నైపుణ్యాలకు సెలవుగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఐటీ ఎంపి వైస్ ప్రసిడెంట్ శంకర్ విశ్వనాధన్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ డి శుభకర్, రిజిస్ట్రార్ డాక్టర్ సి ఎల్వీ శివకుమార్ పాల్గొన్నారు.