విజయవాడ

కాంగ్రెస్ కార్యాలయంలో రంగా, అల్లూరి, పింగళికి ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: వంగవీటి రంగా ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, రంగా జాతీయ నాయకుడని, ప్రజల నాయకుడని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన రంగా 69వ జయంతిలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత ఆంధ్రరత్న భవన్ మొదటి అంతస్తులోని సిటి కాంగ్రెస్ కార్యాలయంలో రంగా జన్మదినోత్సవం నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ఎపిసిసి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతిని నిర్వహించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సి రామచంద్రయ్య మాట్లాడుతూ రంగా నిజమైన ప్రజా నాయకుడన్నారు. రంగాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి రోజులు, అలాంటి నాయకులు మనకు అరుదని, వారి ఆశయ సాధనకు కృషి చేయడమే మనము వారికి అర్పించే నిజమైన నివాళులన్నారు. అల్లూరి సీతారామరాజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. అత్యంత చిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సభానంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడో చైనా పర్యటనలో ఉండి రాష్ట్రంలో ఏ మూల ఎంత వర్షం పడిందో తెలుసుకుంటున్న చంద్రబాబు దేవాలయాల కూల్చివేతపై మంత్రుల కమిటీ ఎందుకని రామచంద్రయ్య అన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో జరిగిన ఆలయాల కూల్చివేత తెలియదా? ఆయన ఆదేశాలు లేకుండానే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ ఉందా అని ప్రశ్నించారు. ఆ శాఖను టిడిపి ప్రభుత్వం తీసివేయదల్చుకుందేమోనని అనుమానం కలుగుతుందన్నారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా, దేవాదాయ శాఖకు చెందిన వేల కోట్ల రూపాయలు విలువ చేసే సదావర్తి సత్రం భూములను లక్షల రూపాయలకు ఎలా విక్రయించారని, ఇదెక్కడి దారణమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో మిత్రపక్షమైన బిజెపి రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో పరిస్థితి టిడిపి పాలనను ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు అన్నారు. ప్రపంచమంతా స్వీస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మాత్రం ఈ విధానం అత్యంత గొప్పదని ఈ విధానంలో పనులు అప్పజెప్పడం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిసిసి ప్రధాన కార్యదర్శులు నరహరశెట్టి నరసింహరావు, మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పీఆర్వో బొమ్మల శ్రీనివాసు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కాంగ్రెస్ నాయకులు వేమా రత్నరావు, లీగల్ సెల్ చైర్మన్ గవ్వ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాపునాడు నగర కార్యాలయంలో...
గాంధీనగర్‌లో దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. బాబాయ్ హోటల్ సమీపంలోని మందాకిని కాంప్లెక్స్‌లోని విజయవాడ నగర కాపు సంఘం అధ్యక్షులు విక్రమ్ నాగు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, కాపు సంఘాల జెఏసి అధ్యక్షులు కొప్పుల వెంకట్, రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను, యువజన కాంగ్రెస్ మాజీ నాయకుడు బాడిగ శంకర్, గిరిజన నాయకుడు మేడా రమేష్, ఎన్‌ఎస్‌యుఐ రాజు, కాపు నాయకులు మల్లమూడి పిచ్చయ్య తదితరులు మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రంగా ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో...
వంగవీటి మోహనరంగా 69వ జయంతి వేడుకలు, కేక్ కటింగ్ గాంధీనగర్‌లోని రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు పిళ్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా బడుగు, బలహీనవర్గాల వారికి అండగా నిలిచిన నాయకుడన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు బేతు రామమోహనరావు మాట్లాడుతూ గాంధేయమార్గంలో నిరాహారదీక్ష చేస్తుండగా అరాచకశక్తులు ఆయనను అంతమొందించటం జరిగిందన్నారు. ఆయన మరణానంతరం గొప్ప నాయుకడ్ని కోల్పోయామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు పిళ్ళా వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా కాపునాడు అధ్యక్షులు బేతు రామమోహనరావు, గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలశెట్టి సురేంద్ర, విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ యర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకురాలు వందన, ఆకుల జయప్రద తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా పుష్కరాల దృష్ట్యా ప్రత్యేక అధికారిగా నగరానికి విచ్చేసిన రమేష్‌బాబు
విజయవాడ (రైల్వేస్టేషన్), జూలై 4: ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల ప్రత్యేక ఏర్పాట్లు దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే పుష్కరాల ప్రత్యేక అధికారిగా రమేష్‌బాబుని నియమిస్తూ ఉత్తర్వులు ఎస్‌సి రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా విడదల చేసారు. రమేష్‌బాబు ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైలు నిలయం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. అనంతరం విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమర్, అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వేణుగోపాలరావులను ప్రత్యేక పుష్కర అధికారిగా కలిసారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా కూడా రమేష్‌బాబు విధులు నిర్వహించారు. అదే తరహాలో మరో నెల రోజుల్లో రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని చేయవలసిన ఏర్పాట్లు, అదనపు సిబ్బంది, అదనపు పోలీస్ బలగాలతో పాటు అదనపు ఏర్పాట్లు దృష్ట్యా ముందుగానే ప్రత్యేక అధికారి నగరానికి చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ప్రత్యేక అధికారికి ప్రత్యేక ఏసి చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాలను జరిపించే విధంగా రమేష్‌బాబు ఇక్కడి అధికారులతో కలిసి పయనించనున్నారు.