విజయవాడ

ఏపీ రైతులపై ఎందుకు అంత కోపం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: ఆరుగాలం శ్రమించే రైతాంగానికి ప్రతిపక్ష నాయుకుడిగా చేసిందేమిటో చెప్పాలని వైకాపా అధినేత జగన్‌ను రాష్ట్ర మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రశ్నించారు. ఏపీ అన్నదాతలపై ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంతో కలిసి రాష్ట్ర రైతులకు అన్యాయం చేయడం మినహా చేసిందేమి లేదంటూ శుక్రవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి సహకరించమని కేంద్రాన్ని ఒక్కసారైనా అడిగారా అన్న విషయం చెప్పాలన్నారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని రైతాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఒప్పుకోమన్న వారితో కలవడం అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకేనని ఆరోపించారు. రాష్ట్రం అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌గా మారడం ఇష్టం లేదని, నవ్యాంధ్ర రైతులు సుభిక్షంగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారని జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు అడ్డుకునే టీఆర్‌ఎస్ నేతలతో చేయి కలిపి రైతులను వంచిస్తున్నారని విమర్శించారు. కుట్రలను అధిగమిస్తూ, సాగు నీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బచావత్, బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పులకు, విభజన చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల కాంట్రాక్టులు కొంతమంది వైకాపా నేతలు పొందడంతో పరోక్షంగా సహరిస్తున్నారని, ఒక్కసారైనా దీనిపై నోరు మెదిపారా అని ప్రశ్నించారు. అక్రమంగా 120 టీఎంసీల నీటిని వాడుకుంటున్నా స్పందించే ధైర్యం లేదని విమర్శించారు. నాగార్జున సాగర్ కుడికాలవ గేట్ల వద్ద ఏపీ అధికారులకు ఆటంకాలు సృష్టించినా స్పందించకపోవడానికి కారణమేమిటన్నారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని హరీష్ రావు లేఖ రాస్తే సంతోషపడటం దేనికి సంకేతమన్నారు. గోదావరి మిగులు జలాల్లో వాటా ఇవ్వద్దని వైఎస్ రాజశేఖర రెడ్డి లేఖ రాస్తే, జగన్ మాత్రం రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేస్తూ, రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు వీలుగా కేసీఆర్‌కు అండగా నిలిచారని ఆరోపించారు. జలయజ్ఞంలో 84 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ, ఆయకట్టు పెరగలేదని, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారడమే ఇందుకు కారణమా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం, అధికార దాహానికి రైతులను మరోసారి బలి చేస్తున్నారని, జలదోపిడీలో వాటాలు తేల్చుకునేందుకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆ లేఖలో విమర్శించారు.