విజయవాడ

ఎర్రకట్టపై నెర్రలో ఇరుక్కుపోయిన ఒంటె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 17: నగరంలో ఇటీవల సంచరిస్తున్న ఒంటెల్లో ఒకటి ఆదివారం కేదారేశ్వరపేట ఎర్రకట్ట సమీపంలోని రైల్వేబ్రిడ్జి రోడ్డు సందుల్లో కాలుపడి ఇరుక్కుపోయింది. బాధతో విలవిల్లాడుతున్న ఒంటె ట్రాఫిక్ సీఐ దుర్గారావు చొరవతో బయటపడింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. రాజస్తాన్ నుండి వచ్చిన సుమా రు 10 కుటుంబాలు తమ వెంట ఒంటెలను తీసుకొచ్చాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో చిన్నారులను ఎక్కించి ఒంటె సవారీ చేయించి జీవనం సాగిస్తున్నారు. రూ. 30లు వసూలు చేసి చి న్నారులను ఉల్లాస పరుస్తున్నారు. ఆ క్రమంలో మ్యాంగో మార్కెట్ ప్రాం తం నుండి సితార సెంటర్‌కి ఎర్రకట్ట మీదుగా వస్తున్నారు. కేదారేశ్వరపేట ప్రాంతంలోని రైల్వేబ్రిడ్జి బ్లాకుల మధ్య సిమెంట్ తారు నామరూపాలు లేకుం డా పోయి పెద్దపెద్ద నెర్రులిచ్చాయి. ఒం టెలు ఆ మార్గంలో నడుస్తుండగా ప్ర మాదవశాత్తు ఒకదాని కాలు ఆ నెర్రిలో పడింది. అంతే ఆ బాధకు తట్టుకోలేని ఒంటె విలవిల్లాడింది. అది గమనించిన ట్రాఫిక్ సీఐ దుర్గారావు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ని మళ్లించారు. పొక్లెయిన్‌ను రప్పించి దాని సాయంతో రోడ్డును వెడల్పుగా గాడి చేయించి ఒంటె కాలును బయటకు తీయించారు. వెంటనే తారు, సిమెంట్‌ను తెప్పించి ఆ నెర్రిని పూడ్చారు. నాలుగు గంటల పాటు వాహనాలను దారి మళ్లించారు. కేవలం ద్విచక్ర వాహనాలనే అనుమతించారు. పోలీసుల చొరవను స్థానికులు ప్రశంసించారు.

సంతోషాల నగరం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: విజయవాడ నగరాన్ని సంతోష నగరంగా రూపుదిద్దుకుంటున్నట్టు ప లువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివా రం ఉదయం నగరంలోని ఐజీఎం స్టేడి యం వద్ద వీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో పలువురు కళాకారులు తమ కళాప్రదర్శనలు నిర్వహించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరాన్ని సంతోషాల నగరంగా కూడా తీర్చిదిద్దడంతో ఆధునిక యాంత్రిక జీ వనంలో ఆదివారం రోజు చిన్నా పెద్దలు ఉత్సాహంగాను, ఉల్లాసంగా గడిపేందుకు నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. సన్‌షైన్ ఈవెంట్స్, యంగ్‌స్టార్ డాన్స్ అకాడమి ఆధ్వర్యంలో అనేక సినీ గీతాలను ఆలపించి డ్యాన్స్‌లతో చక్కటి వినోదాన్ని పంచారు. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వివిధ సాంప్రదాయ సంస్కృతిక నృత్యాలు, ప్రజలను ఆనంద డోలికలలో నింపారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు తమ క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించారు.