విజయవాడ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్లీ పట్టం కట్టడం ఖాయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకర్గ పార్టీ సమన్వయ కమిటీ, ఏరియా కోఆర్డినేటర్ల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లోని ప్రతి గ్రామంలో ఐదేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేయించామని చెప్పారు. నూటికి నూరు శాతం తాను చెప్పినవి, చెప్పవని కూడా అమలు చేశామన్నారు. వైసీపీ మాయమాటలు నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకబడి పోతుందని, తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలన్నారు. సమావేశంలో సీహెచ్ రాధా, కుమారి, జంపాల సీతారామయ్య, రాజశేఖర్, కోమటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సూచనలతోనే ఎన్నికల మేనిఫెస్టో
*టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, ఫిబ్రవరి 19: మండల స్థాయిలో టీడీపీకి ప్రజల్లో ఉన్న బలంతో పాటు లోపాలు తెలుసుకోవటం, గ్రామస్థాయిలో తటస్థులను ఎన్నికల లోపు కలవడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు. పార్టీ ప్రముఖులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించే దశగా ఆయా సామాజిక వర్గాల నాయకులను, తటస్థులను, గ్రామ పెద్దలను కలిసి వారి సలహా, సూచనలతో గ్రామస్థాయి మేనిఫెస్టోకు రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే చేసిన అభివృద్ధితో పాటు రానున్న కాలంలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూలంకషంగా చర్చించారు. సమావేశంలో జెడ్పీటీసీ శ్రీనివాసరావు, దుర్గగుడి పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కాసరనేని మురళి, పెనమలూరు మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, కానూరు గ్రామ దత్తతదారుడు అనే్న వేణుగోపాలకృష్ణమూర్తి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొర్రా కృష్ణ, యనమలకుదురు, పోరంకి, కానూరు గ్రామ పార్టీ అధ్యక్షులు మొక్కపాటి శ్రీనివాసరావు, తోటకూర సుబ్బారావు, దోనేపూడి రవికిరణ్, మండల పార్టీ కార్యదర్శి షేక్ బాజీ షాహీద్, తెలుగుయువత నాయకుడు కొమ్మినేని వెంకటేష్ పాల్గొన్నారు.