విజయవాడ

రానున్నది వైసీపీ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: అవినీతి.. అసమర్ధ పాలనకు కాలం చెల్లిందని రానున్నది వైసీపీ ఆధ్వర్యంలోని స్వర్ణయుగ ప్రభుత్వమేనని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 19,20,55,59 డివిజన్‌లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, యువకులు అధికసంఖ్యలో బుధవారం వైసీపీలో చేరారు. విష్ణు వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాలు, మోసపూరిత విధానాలే లక్ష్యంగా, అక్రమార్జనే ధ్యేయంగా పాలన సాగించిన టీడీపీ నాయకుల హయంలో ప్రజలు దుర్భర జీవనాన్ని సాగించారని మండిపడ్డారు. ఇనే్నళ్లు ప్రజల కష్టాలను పట్టించుకోని టీడీపీ నాయకులంతా ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మన ఇళ్లకు వస్తున్నారని, ప్రజలంతా వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఇరవై రోజుల పాటు ప్రతి కార్యకర్త, అభిమాని వైసీపీ గెలుపుకు సైనికుల్లా పని చేయాలని ఆయన కోరారు. ఆయా డివిజన్లకు చెందిన నాయకులు ఉద్దంటి సురేష్, మస్తాన్, ధనుంజన్, రామ్‌సాయి, దుర్గారెడ్డి, చిరంజీవి, తోట నారాయణ, శివరావు, శ్రీనివాసరావు, నాగరాజు, యేసుబు, వాసిరెడ్డి అనురాధ, పార్థసారధి, గంటా శ్రీను, భాస్కరరావు, సానికొమ్ము అర్జున్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, వంటేరు శ్రీను ఆధ్వర్యంలో వందల మంది యువకులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.