విజయవాడ

ముఖ్యమంత్రికి బాసటగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: కార్మికుల, ప్రధానంగా డ్రైవర్ల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అన్ని వేళలా బాసటగా ఉంటామని డ్రైవర్ల సంక్షేమం కోసం ఏర్పాటైన రథసారధి అసోసియేషన్ ప్రకటించింది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా అత్యంత ప్రదానమైనదని గురువారం ఒక ప్రకటనలో సంస్థ జనరల్ సెక్రటరీ జీవీ విజయకృష్ణ పేర్కొన్నారు. డ్రైవర్లకూ చంద్రన్న బీమా పథకం వర్తింపజేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్లకు సొంత వాహనాలు సమకూర్చారన్నారు. అదే విధంగా మహిళల కోసం షీ ఆటోలు ఇచ్చారన్నారు. రవాణశాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి పలువురికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించారన్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం డ్రైవర్ల సాధికార సంస్థను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్మికుల ముఖ్యంగా డ్రైవర్ల సంక్షేమం కోసం ఇన్ని చర్యలు తీసుకున్న చంద్రబాబునాయుడికి అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆటో, ట్యాక్సీ, లారీ నడిపే వాహనం ఏదైనా డ్రైవర్లందరూ ఒక్కటేనన్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలతో సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. ఆయన వెంటే తామందరం నడుస్తామని స్పష్టం చేశారు.