విజయవాడ

విశేషంగా ఆకర్షిస్తున్న అలంకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 17: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం ముందు ఉన్న రావిచెట్టు, రాజగోపురం ఎదుట, రెండు ప్రదేశాల్లో కూరగాయలతో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దుర్గమ్మను దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తుల కోసం శ్రీవనంలో కొలువుదీరిన దుర్గమ్మ, రాజగోపురం ఎదుట సింహావాహానాన్ని అధిష్టించిన దుర్గమ్మ, సంతోషిమామాత, గణపతి వంటి దేవతమూర్తులను ప్రత్యేకంగా కూరగాయలతో ఏర్పాటు చేసిన భక్తులు తాకకుండా స్టాల్స్‌ను సిబ్బంది ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన భక్తులు వాటిని అసక్తిగా చూసి వాటిని కెమెరాల్లో బంధించారు.