విజయవాడ

ఓటు కోసం ఇచ్చే డబ్బుకు మోసపోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీడీపీ నేతలు డబ్బుల ఆశ చూపిస్తారని, డబ్బును చూసి ఓటేస్తే మళ్లీ మోసపోవడమేనని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సెంట్రల్ పరిధిలోని 42, 55వ డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మల్లాది మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు పాలన సాగించిన వారు ప్రజాసమస్యలకు సంబంధించి ఏ ఒక్క సమస్యలను పరిష్కరించ లేదన్నారు. ఓట్లు కోసం పంచే డబ్బులకు ఆశ పడి మళ్లీ వారికే ఓటు వేస్తే మరో ఐదేళ్ల పాటు సమస్యలు తప్పవన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందన్నారు. ఓటు కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను ఇన్నాళ్లు తమకేమి చేశారంటూ నిలదీయాలని ఓటర్లకు పిలుపునిచ్చిన మల్లాది రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టేనన్నారు.
19వ డివిజన్‌లో..
జగన్ పరిపాలనతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాజన్న పాలన కోసం ప్రస్తుత ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 19వ డివిజన్ కో-ఆర్డినేటర్ ఉద్దంటి సురేష్ ఆధ్వర్యంలో సూర్యారావు పేటలోని సూర్యనారాయణ వీధిలో ఏర్పాటుచేసిన వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కో-ఆర్డినేటర్ సురేష్ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరగా, పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో నైనావతి, లక్ష్మీగిరిధర్, వినుకొండ శివరోషి, కాజా శంకర్, బుగతా శంకర్, తదితరులు పాల్గొన్నారు.

25న చలసాని నామినేషన్

విజయవాడ, మార్చి 23: ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనసేన, సీపీఎం, బీఎస్పీ పార్టీలు బలపర్చిన సీపీఐ అభ్యర్థిగా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది. స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్‌కుమార్ నామినేషన్‌ను సోమవారం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం అలంకార్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటున్నారు.