విజయవాడ

ఆర్యవైశ్య పక్షపాతి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 24: ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేయటానికి రూ.33కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానీ, అసెంబ్లీ అభ్యర్థి బొండా ఉమా పేర్కొన్నారు. ఏలూరురోడ్ రాజ్‌టవర్స్ హోటల్ సెంటర్‌లో ఆదివారం ఉదయం ఆర్యవైశ్య నేతలు దింటకురి వీరరాఘవ ఉదయ్‌కుమార్, తుమ్మల పెంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ ఇద్దరు అభ్యర్థులు ఆర్యవైశ్య కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య నేతలు రాఘవ మాట్లాడుతూ ఆర్యవైశ్యల ఆర్థికాభివృద్ధి కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బాబును మళ్లీ సీఎం చేసేందుకు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ సైనికులుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబుకు అఖండ విజయం చేకూర్చి ఆర్యవైశ్యులు తమ కృతజ్ఞతను తెలుపుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్యనేతలు కోడూరి సాయిబాబా, కొండవేటి చలపతిరావు, అర్బన్ దేశం నేతలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా అమరావతి కిడ్స్ రన్
*బీఆర్‌టీఎస్ రోడ్డులో పరుగులు తీసిన చిన్నారులు
విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 24: ఆరోగ్యమే మహాభాగ్యము కార్యక్రమంలో భాగంగా అమరావతి రన్న ర్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అ భివృద్ధి ప్రాధికార సంస్థల సంయుక్త ఆ ధ్వర్యంలో ఆదివారం బీఆర్‌టీఎస్ రో డ్డుపై పడవలరేవుకూడలి నుండి ప్రా రంభించిన అమరావతి కిడ్స్ రన్‌కు వి శేష స్పందన లభించింది. 55 పాఠశాల ల నుండి 500 మంది పిల్లలు 2కె, 3కె, 4కె రన్‌లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి 8వరకు జరిగింది. జుం బా డ్యాన్స్, విచిత్ర వేషధారణ చిన్నారులను అలరించాయి. బాబు.ఎ, మహేష్‌కుమార్ రన్‌ను ప్రారంభించారు. అ నంతరం పతకాలను అందజేశారు.