విజయవాడ

ప్రజలకు సేవ చేయటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 26: ఎమ్మెల్యే పదవంటే మన తరానికి సరిపోయేంతగా డబ్బులు, ఆస్తులు సంపాదించుకోవడం కాదని, ప్రజలకు మంచి పనులు చేసి తరతరాలు చెప్పుకునేవిధంగా పనిచేయడమే లక్ష్యంగా ఉండాలని సెంట్రల్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 56, 57వ డివిజన్లలో నిర్వహించిన రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం చేసిన మల్లాది విష్ణు జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ఆ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సెంట్రల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపుతానని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ ప్రభుత్వంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని, సెంట్రల్ నియోజకవర్గ ప్రాంతాలన్నీ ఐదేళ్లు వెనక్కిపోయాయని తెలిపారు. కనీస అవసరాలైనా తీర్చలేని దుస్థితిలో పాలన సాగించిన టీడీపీ పాలకులు తమ సంపాదనలపైనే దృష్టి పెట్టారనే కానీ ప్రజల సంక్షేమం గూర్చి పట్టించుకోలేదన్న విషయం స్పష్టమవతోందన్నారు. వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరీపేట, శాంతినగర్, పాయకాపురం, కండ్రిక, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలు ఎన్నో అపరిష్కృత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇనే్నళ్లు పట్టించుకోని టీడీపీ పాలకులు ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఓట్ల కోసం ఇంటికి వస్తున్న వారిని నిలదీయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జానారెడ్డి, వరలక్ష్మి, బేవర నారాయణ, బోరా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 20, 54, 57, 58వ డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పలువురు టీడీపీ నాయకులు, ముస్లీం, మైనార్టీ యువత వైఎస్‌ఆర్‌సీపీలో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సెంట్రల్ అభ్యర్థి మల్లాది విష్ణు, టీడీపీ ప్రభుత్వ విధానాలతోను, స్తానిక నేతల అనైతిక చర్యలతో విసిగి వేసారిన ప్రజలు వైసీపీలోకి చేరడమే కాకుండా జగన్‌ను సీఎం చేసేందుకు సన్నద్దమవుతుండటం అభినందనీయమన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నూతన ప్రభంజనాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు.

సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం
రాష్ట్రంలో సుపరిపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తూర్పు నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం 4వ డివిజన్ గుణదల సెంటర్ నుంచి ఎన్నిలక ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని కుమ్మరి బజారు. బెత్లెహేమ్‌నగర్, రెవిన్యూ కాలనీ, పడవల రేవు సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుట్రదారులను తిప్పికోట్టాలంటే టీడీపీ జెండా ఎగరాలన్నారు. పేద ప్రజల సంక్షేమ కోసం పాటు పడే చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అన్నదమ్ములాంటి ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కెసిఆర్ పంచన చేరిన జగన్ గందరగోళం రేపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి గాబ్రియేలు, డివిజన్ అధ్యక్షుడు గోవాడ ప్రసన్న తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు
నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్ళని గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 22వ డివిజన్‌లో పర్యటించి ఓట్లు అభ్యర్థిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. సుపరిపాలన కొనసాగాలంటే మళ్ళీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి పధంలో నడిపించగల సత్తా కలిగిన నాయకుడు గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ, జనసేన అభ్యర్ధులను నమ్మరాదని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేసే నాయకులు గద్దె రామ్మోహన్ కేశినేని నానిలు అని తెలిపారు. అంతకుముందు డివిజన్‌లోని నల్లగేటు, శంకరమఠం, పీడర్‌రోడ్డు, తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మోటేపల్లి చిన్నా, చింతా వెంకటేశ్వరరావు, కొడాలి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.