విజయవాడ

జిల్లా రాజకీయాల్లో నెహ్రూది చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏప్రిల్ 17: జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) చెరగని ముద్ర వేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నెహ్రూ ద్వితీయ వర్ధంతి సభ బుధవారం ఉదయం గురునానక్ నగర్‌లోని నాక్ కల్యాణ మండపంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్రంలో నెహ్రూకు ప్రత్యేక గుర్తింపు వుందని తెలిపారు. జిల్లాలో నెహ్రూది ప్రత్యేక స్థానమని చెప్పారు. ఆయన తనయుడు దేవినేని అవినాష్ గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ పడినప్పుడు నెహ్రూ అనుచరులు చూపిన ప్రేమ జిల్లా వాసుల్లో ఆయన స్థానమేమిటో తెలియజేస్తుందని ఉమా ఉదహరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే తెలియనివారు ఉండరన్నారు. ఆయనను నమ్ముకున్న వారికి నెహ్రూ వెన్నంటే వుంటూ న్యాయం చేసేవారన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దిశ, దశ అయితే దేవినేని నెహ్రూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. అవినాష్ గుడివాడ ఎన్నికల్లో బహుబలిలా ప్రవేశించి బల్లాల దేవునికి తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే తామూ గెలిచినట్లేనని భావించి పట్టుదలతో పనిచేసిన నెహ్రూ అనుచరులు, తామంటే ఏమిటో నిరూపించారని చెప్పారు. ఎన్నికల్లో విజయానికి పట్టుదలతో పనిచేసిన అందరికీ అవినాష్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలా వుండటానికి ఆనాడు దేవినేని నెహ్రూ చేసిన కృషి కారణమన్నారు. గుడివాడలో బలమైన ప్రత్యర్థి నానీని ఢీకొన్న అవినాష్ ఘన విజయం సాధించబోతున్నాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్, రావి వెంకటేశ్వరరావు, పెద్దసంఖ్యలో దేవినేని అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెహ్రూ ఘాట్‌లో ఘన నివాళులు
దివంగత నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం గుణదల రైల్వేస్టేషన్ సమీపంలోని నెహ్రూ ఘాట్‌ను పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు సందర్శించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు, నెహ్రూ తనయుడు అవినాష్, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, తదితర నాయకులు ఘాట్ వద్ద పుష్పమాలలు ఉంచి నెహ్రూకు ఘనంగా నివాళులు అర్పించారు.