విజయవాడ

రాష్ట్ర విభజన తరువాత వేగంగా నగరాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 17: రాష్ట్ర విభజన తరువాత రాజధాని నగరంగా ప్రఖ్యాతిగాంచిన విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఈరోస్ హోటల్‌లో 4వ ఆసియా ఫసిపిక్ ఫోరమ్స్ ఆన్ అర్బన్ రీసైలెన్స్ అండ్ అడ్వాన్స్ రీసైలెంట్ సిటీస్ ఆసియా ఫసిపిక్ కాంగ్రెస్ - 2019 సెమినార్‌లో భాగంగా చివరి రోజైన బుధవారం జరిగన సభలో మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ సమర్థవంతమైన మాస్టర్ ప్లాన్ కలిగిన ఈనగరం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను అమలుచేసినట్టు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిన సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్టు తెలిపిన శ్రీ్ధర్ విద్యుత్ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పొందుతున్నామన్నారు. నగరంలో 5 ప్రదేశాల్లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటుచేశామన్న ఆయన వరద నీటి నివారణ వ్యవస్థ, డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ వార్డులు, గ్రీనరీ, వేస్ట్ మేనేజ్‌మెంట్, నీటి సరఫరా ప్రజా రవాణా వ్యవస్థలలో నూతన సాంకేతిక పద్ధతులను అమలుచేసి విస్తృత ప్రయోజనాలను పొందుతున్నామన్నారు. ఈ సందర్భంగా జరిగిన సెమినార్‌లో నగరీకరణ, వౌలిక వసతులు, పెట్టుబడులు, తక్కువ కాలుష్య నివారణతో ట్రాన్స్‌పోర్టేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ కన్వర్షన్, గ్రీనరీ డెవలప్‌మెంట్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ లోకల్ బాడీస్ తదితర అంశాలపై జరిగిన చర్చలో ఐసీఎల్‌ఈఐ సౌత్ ఆసియా డైరెక్టర్ ఈమని కుమార్, ఐసీఎల్‌ఈఐ జర్మనీ మేనేజర్ కె వ్యాన్ మాట్లాడుతూ భవిష్యత్తులో నగర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, నగరాభివృద్ధిలో భాగంగా గ్రీన్ హౌస్ గ్యాప్‌లను తగ్గించుకునే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు వలన వర్షాలు సకాలంలో కురిసే అవకాశం లేదని, వాతావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ గ్యాపులు, వేస్ట్ డంపింగ్ వలన నగరాల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈఎస్‌ఐపై సభ్యులకు అవగాహన
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 17: ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4నుండి 6వరకు ఈఎస్‌ఐ విధానాలు, కొత్తగా వచ్చిన మార్పులు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసదస్సులో ఈఎస్‌ఐ కార్పొరేషన్ రీజనల్ డైరెక్టర్ బీ రామకోటి పాల్గొని తగు సూచనలు, సలహాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. ఈఎస్‌ఐ వలన కలిగే ప్రయోజనలు, ఉపయోగాలను తెలియజేశారు. వైద్యప్రయోజనం, బీమాదారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రాథమిక, ద్వితీయ శ్రేణి వైద్యసేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందవచ్చన్నారు. అర్హుడైన బీమాదారునికి పనిచేయని రోజులకు 70శాతం నగదు చెల్లించబడుతుందని, శాశ్వత వైకల్యం ఏర్పడితే బీమాదారునికి ప్రతి నెల కోల్పోయిన సంపాదనను పింఛను రూపంలో చెల్లిస్తారన్నారు. ఈసదస్సులో ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ, డైరెక్టర్ ఎం మురళీకృష్ణ, పీ కోటిరావు, తదితరులు పాల్గొన్నారు.

రేపు రాష్ట్ర జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపిక
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, కృష్ణా జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ జూనియర్ (అండర్-18) సాఫ్ట్ టెన్నిస్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పీ మురళి తెలిపారు. ఎంపికైన జట్లు జూన్ 7నుండి 11వరకు మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో జరగనున్న 14వ జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్‌టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయన్నారు. ఎంపికలు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతాయని, వివిధ జిల్లాల క్రీడాకారుల ఆయా జిల్లా బాధ్యుల అనుమతితోపాటు ఆధార్‌కార్డ్ జిరాక్స్, వయస్సు ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో 19న ఉదయం 9గంటలకు హాజరవ్వాలని తెలిపారు.