విజయవాడ

ఇంటర్ టెర్రర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మే 18: విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్‌లో పిల్లలను చేర్పించాలంటే తల్లిందండ్రులకు దడ పుడుతోంది. ప్రతీ విద్యార్థికి కీలకమైన ఇంటర్ విద్యను అలుసుగా తీసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలు తమ బ్రాండ్ ఇమేజ్, ర్యాంకుల చిట్టాను చూపించి మరీ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అన్ని వౌలిక సదుపాయాలు, అత్యుత్తమ అధ్యాపకులున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం కనె్నత్తి చూడకపోవడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పిండుకుంటున్నాయి. విద్యను కాసుల మయంగా మార్చిన కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచార ఆర్భాటం ఒకవైపు, పిల్లల వైపు నుండి వస్తున్న ఒత్తిళ్లతో తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే చదివిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని భావిస్తున్న తల్లిదండ్రుల బలహీనతను కార్పొరేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటీకి సంబంధించిన కోర్సులకు వెళ్లేలా విద్యార్థులకు మంచి పునాది వేసేలా తమ విద్యాబోధన ఉంటుందని ఆశ చూపుతున్నాయి. మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ కోసం కళాశాల ఫీజు సుమారు 35 వేలు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు, మెటీరియల్, బిల్డింగ్ ఫీజులు అదనం. ఇక ఐఐటీ, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ కోసం మరో బాదుడు ఉంటోంది. విద్యార్థులు ఎంపిక చేసుకున్న దాని ప్రకారం ఆయా కోర్సులకు సంబంధించి వేలల్లో ఫీజులు గుంజుతున్నారు. ఐఐటీ కోర్సు చదవాలనుకునే విద్యార్థి నుండి సుమారుగా రూ. 70 వేలు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు, జేఈఈ కోర్సు కోసం రూ. 50 వేలు, ఎంసెట్ కోర్సు కోసం అయితే 30వేలు వసూలు చేస్తున్నాయి. ఇక రెసిడెన్షియల్ ఫీజు మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి సుమారుగా రెండు లక్షల వరకు ఖర్చవుతోంది. ప్రైవేటు కళాశాలల్లోనూ దీనికి కాస్త తక్కువ చేసి దండిగానే ఫీజులు పిండుతున్నారు. మొదటి సంవత్సరం ఎంపీసీకి రూ. 15వేలు, ఆర్ట్స్ గ్రూప్ కోసం 10వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా మెటీరియల్, పుస్తకాలు, బిల్డింగ్ ఫండ్, లాబరేటరీ ఫీజులు షరామామూలే. వీటితోపాటు పరీక్ష ఫీజులు, పరీక్షలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు బస్సు ఫీజులు భారీగానే గుంజుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వీరు పదో తరగతి పాసైన విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆయా కళాశాలల్లో చేర్పించేలా ప్రేరేపిస్తున్నారు. ఇందుకు గాను కమీషన్‌గా వారికి భారీగానే నగదు ముట్టజెపుతున్నారు. ఆ భారం కూడా విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడుతోంది. నేరుగా కళాశాలను సంప్రదించిన తల్లిదండ్రులకు ఫీజు ఒకరకంగా, ఏజెంట్లు లేదా కళాశాల అధ్యాపకుల ద్వారా వెళ్లిన మరో రకంగా భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. క్యాంపస్, ఫ్యాకల్టీని బట్టి కూడా ఫీజుల్లో తేడా చూపుతున్నారు.
అధ్యాపకుల కొరతే లోపం
లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల్లో అప్పులు చేసి మరీ చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపు కనె్నత్తి చూడటం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో తగినన్ని సీట్లున్నా వాటిలో చదివించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం ఫీజు కింద ఓసీ విద్యార్థి కేవలం రూ. 1300లు, బీసీ విద్యార్థి రూ. 350 చెల్లించి కోర్సు పూర్తి చేయవచ్చు. ఆర్ట్స్ గ్రూప్‌కు ఓసీ విద్యార్థి రూ. 750, బీసీ, మిగిలిన కేటగిరీ విద్యార్థులు కేవలం రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీంతోపాటు పరీక్ష ఫీజు సుమారు రూ. 500 మాత్రంమే విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. పైగా విద్యార్థులకు ప్రతీ ఏటా స్కాలర్‌షిప్ కింద ప్రభుత్వం రూ. 3500 వరకు చెల్లిస్తుంది. ఇంతచేస్తున్నా ప్రతీ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల శాతం తగ్గుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉండటం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధికాంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వౌలిక సదుపాయాలున్నా తగినంతగా అధ్యాపకులను నియమించటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో మంచి ఫ్యాకల్టీ ఉండటంతో ఫీజులు ఎక్కువుగా ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసైనా చదివించాల్సి వస్తోందని వివరిస్తున్నారు.