విజయవాడ

జూన్ 10న భవన నిర్మాణ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 20: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జూన్ 10న నగరంలోని డెప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ నగర కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టీ తాతయ్య తెలిపారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మొగల్‌రాజపురం బందెలదొడ్డి సెంటర్లోని బోయపాటి మాధవరావు గ్రంథాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్మికుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో నిర్వహిస్తున్న ధర్నాకు కార్మికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సోనా రాజు మాట్లాడుతూ ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డు, సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల ద్వారా కార్మిక పెన్షన్‌తో పాటు గర్భిణులకు డెలివరీ ఖర్చులకు 50వేల రూపాయలతో పాటు పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, ప్రమాదవశాత్తూ చనిపోతే 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు అప్పురబోతు రాము, స్థానిక నాయకులు కె సింహాచలం, పూసర్ల లక్ష్మణరావు, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.