విజయవాడ

వైసీపీ పాలనలో అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 17: దాదాపు 20రోజుల వైసీపీ పాలనలో అనేక వర్గాల ప్రజలకు అప్పుడే కష్టాలు ఆరంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవినీతిని వెలుగులోకి తెస్తే అధికారులకు సన్మానం చేస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ నిజంగా తెలుగుదేశం పాలనలో అవినీతి జరిగి ఉంటే అధికారంలో ఉన్న మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీరు గతంలో పుస్తకాలు ముద్రించి మరీ తెలుగుదేశంపై బురద చల్లారని, ఇప్పుడు వారి మాటలు విటుంటే అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారని అర్థమవుతోందన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఏపీని చంద్రబాబు అనేక విధాలుగా అభివృద్ధి చేశారని, నిర్మాణ రంగంపై భారం పడకూడదని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల కూలీలు పస్తులతో పడుకుంటున్నారని, ఏపీలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని, లారీ ఇసుక గతంలో రూ.5వేలు ఉంటే ఇప్పుడు రూ.20వేలు అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వం లోపాలను సవరించకుండా సమీక్ష పేరుతో ఇసుక రవాణా నిలిపివేయడం అన్యాయమన్నారు. బిల్డర్లు పూర్తిగా నష్టపోగా రోజువారీ కూలీలు పనులు లేక ఖాళీ కడుపులతో పస్తులుంటున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక విధానంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. టీడీపీ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే వాటిని బయటపెట్టి సరిచేయాలని, అమరావతిలో అక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ అన్నవారు వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారులకు సన్మానం చేస్తామంటున్నా వారి వద్ద అధారాలు లేవని, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అమలు చేసిన పథకాలకు వైఎస్సార్ పేరు మార్చడం తప్ప కొత్తగా అమలు చేసిందేమీ లేదని, తమకు అధికారం, ప్రతిపక్షం రెండూ అలవాటేనని, అంతిమంగా ప్రజల పక్షమే తమ విధానమని బొండా వివరించారు.