విజయవాడ

వసతిగృహాల నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 11: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించి వసతి గృహాల నిర్వాహణలో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏఏండీ ఇంతియాజ్ వసతి గృహ సంక్షేమాధికారులను కోరారు. నగరంలోని లెనిన్ సెంటర్ అంబేద్కర్ భవన్‌లో గురువారం జిల్లాలోని సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహ నిర్వహణపై సంక్షేమ అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లోనూ వౌలిక వసతుల కల్పనలో సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తే సమస్యలు రావని, అందుబాటులో ఉన్న నిధులు ఆధారంగాను, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా నిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాకారంతోను వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కోరారు. మన ఇంటి సమస్యలను మనమే పరిష్కరించుకున్నట్లుగా వసతి గృహాలను కూడా స్వంత ఇంటిలా భావించాలని హాస్టల్ వార్డెన్లను కోరారు. జిల్లాలో 184 వసతి గృహాలు ఉన్నాయని వాటిలో మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యపై అధిక ప్రాధాన్యతను ఇచ్చి ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా సీఎంగా తాను కూడా వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, వౌలిక వసతులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని, విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారని పేర్కొన్నారు. నిధుల సమస్య ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, వసతి గృహాల్లో వౌలిక వసతుల కల్పనకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. వసతిగృహాలు స్వచ్ఛతతో ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రత పట్ల అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహారంతో కూడిన మెనూ పాటించాలని కలెక్టర్ వసతి గృహాల సంక్షేమాధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతాశాతం పెంచడంతో పాటు అత్యుత్తమ ఫలితాలు వసతిగృహ విద్యార్థులు సాధించడం పట్ల సంక్షేమ అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని రానున్న 10వ తరగతి పరీక్షల్లోను కొనసాగించి జిల్లాను ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపాలన్నారు. ఈసమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పీఎస్‌ఏ ప్రసాద్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ భార్గవి, గిరిజన సంక్షేమశాఖాధికారి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.