విజయవాడ

జగన్ ఇంటి వద్ద 40రోజుల్లో 80 నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద 40రోజుల్లో 80 నిరసనలు జరిగాయని శాసనమండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న అన్నారు. మీడియా పాయింట్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ వైసీపీ పరిపాలన తీరుపై మండిపడ్డారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. నిరసనల దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ విధించారని, టీడీపీ హయాంలో ఏనాడూ ఇలా జరగలేదన్నారు. రాత్రిళ్లు కూడా జగన్ నివాసం వద్ద కొవ్వొత్తుల నిరసనలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు వినటానికి వారి సంక్షేమం కోసం నిర్మించిన ప్రజావేదికను కూల్చటం దుర్మార్గమని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని జగన్ రద్దు చేస్తున్నారని, రేపోమాపో అన్న క్యాంటీన్‌ను కూడా మూసేసే దిశగా వెళ్తున్నారని వెంకన్న విమర్శించారు.