విజయవాడ

దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 18: రానున్న దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించటంతోపాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ స్పష్టం చేశారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి ఆవరణలోని ఈవో కార్యాలయంలో గురువారం ఉదయం సిబ్బందితో ఈవో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది ముందుగానే ప్రణాళిలు సిద్ధం చేసుకుని తన దృష్టికి తీసుకురావాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి విఘాతం కలుగుకుండా ఈఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సుదూర ప్రాంతాల నుండే అనేక కష్టాలు పడి వచ్చే భక్తులు అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఆషాడ మాసం సందర్భంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆషాఢమాసం సారె, 2 రోజుల క్రితం నిర్వహించిన శాకంబరీ ఉత్సవాల స్ఫూర్తితో దసరా మహోత్సవాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సందేహాలున్నా వెంటనే తనదృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈసమావేశంలో దేవస్ధానం వైదిక కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, సహాయ ఈవోలు అమృతరావు,విజయ్‌కుమార్, ఎన్ రమేష్, తిరుమలరావు, పర్యవేక్షకులు,తదితరులు పాల్గొన్నారు.